WhatsApp New Feature: ఇకపై వాట్సాప్‌లో గ్రూప్‌లు ఉండవు.. ఈ కొత్త ఫీచర్‌తో..

WhatsApp New Feature: ఎన్ని రకాల సోషల్ మీడియా యాప్స్ వచ్చినా.. అందులో వాట్సాప్‌కు ఎప్పుడు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మన లైఫ్‌ను చాలా ఈజీ చేసేసాయి. ఇక అందులో వాట్సాప్ వచ్చిన తర్వాత మనుషులతో కాంటాక్ట్ అవ్వడం మరింత ఈజీ అయిపోయింది. వాట్సాప్ తర్వాత చాలా అడ్వాన్స్‌డ్ సోషల్ మీడియా యాప్స్ మనకు అందుబాటులోకి వచ్చినా వాట్సాప్‌కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.
వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు మారే కొత్త ఫీచర్స్ కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ ఉండాల్సిందే. ఇప్పటికే ఎన్నో కొత్త అప్డేట్లతో యూజర్లను సంతోషపెడుతున్న వాట్సాప్.. త్వరలోనే మరో అప్డేట్‌తో మన ముందుకు రానుంది. వాట్సాప్ 'కమ్యూనిటీ' పేరుతో ఒక కొత్త ఫీచర్ త్వరలోనే వాట్సాప్ యూజర్లను పలకరించనుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ యూజర్స్‌కు 2.21.21.6 వెర్షన్ ద్వారా లభించనుంది.
వాట్సాప్ కమ్యూనిటీలో గ్రూప్ ఫీచర్‌కి భిన్నంగా కొత్త ఫీచర్స్ ఉంటాయని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాక్ వాట్సాప్ బీటా (వాబీటా) తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ కమ్యూనిటీ లోపల కూడా గ్రూప్స్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రూప్‌కు అడ్మిన్‌లాగా కమ్యూనిటీకు కమ్యూనిటీ మేనేజర్స్ ఉంటారట. కమ్యూనిటీ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్స్ సమాచారాన్ని ఎక్కువమందితో పంచుకునే అవకాశం ఉంటుంది.
కమ్యూనిటీ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్ గ్రూప్ ఫీచర్‌ను తొలగించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ట్విటర్.. తన ఫీచర్స్‌లో కమ్యూనిటీను యాడ్ చేయనున్నట్టు ప్రకటించింది. తాజాగా అదే ఫీచర్‌ను వాట్సాప్ కూడా రెడీ చేస్తోంది. ఈ రెండు ఫీచర్స్ మార్కెట్‌లోకి రావడానికి మరికొంత కాలం సమయం పడుతుంది. మరి ఈ రెండిట్లో ఏవి ఎక్కువ టెక్ లవర్స్‌ను మెప్పిస్తాయో..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com