WhatsApp Web Update: ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్ పనిచేస్తుంది.. యూజర్లను ఖుషీ చేస్తున్న కొత్త ఫీచర్..

WhatsApp Web Update (tv5news.in)
WhatsApp Web Update: టెక్నాలజీ అంటే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో, అప్డేట్‌లతో టెక్ ప్రేమికులను ఆకర్షించాలి. అలా అయితేనే అది ఎక్కువమంది యూజర్లను సంపాదించుకోగలదు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అన్ని ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్స్‌తో ఆకర్షిస్తున్నాయి కాబట్టే వాటికి యూజర్లు పెరుగుతున్నారు. తాజాగా వాట్సాప్ కూడా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది.
మిగతా సోషల్ మీడియా యాప్స్‌తో పోల్చుకుంటే వాట్సాప్.. చాలామంది యూజర్లను సంపాదించుకుంది. అందుకే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు తన యూజర్లను సంతోషపెట్టేలా అప్డేట్స్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. తాజాగా వాట్సాప్ పేమెంట్స్‌ను అందరికీ అలవాటు చేసింది. క్యాష్‌బ్యాక్ పేరుతో పేమెంట్స్ ఫీచర్‌ను ప్రమోట్ కూడా చేస్తోంది. దానికి తోడు ఇప్పుడు మరో అప్డేట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది.
వాట్సాప్‌ను కంప్యూటర్‌లలో కూడా ఉపయోగించుకునే సౌలభ్యాన్ని కల్పిస్తూ వాట్సాప్ చాలాకాలం క్రితం వెబ్ వాట్సాప్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కానీ వెబ్ వాట్సాప్‌లో ఇప్పటివరకు కొన్ని లోటుపాట్లు ఉండేవి. ఇప్పటివరకు వెబ్ వాట్సాప్ అంటే కేవలం ఒక సిస్టమ్‌కు మాత్రమే మన వాట్సాప్‌ను కనెక్ట్ చేయగలిగేవాళ్లం. ఒకవేళ మన ఫోన్‌లో డేటా అయిపోయినా, పొరపాటున ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయినా సిస్టమ్ నుండి వాట్సాప్ డిస్కనెక్ట్ అయిపోయేది. కొత్తగా పరిచయమైన ఫీచర్‌లో ఈ డిఫెక్ట్స్‌ను తొలగించింది వాట్సాప్ టీమ్. 'యూజ్ వాట్సాప్ ఇన్ అదర్ డివైజెస్' అనే ఆప్షన్‌తో వాట్సాప్‌ను ఒకేసారి వేర్వేరు డివైజ్‌లకు కనెక్ట్ చేసే సౌకర్యాన్ని కల్పిస్తోంది.
వాట్సాప్ మల్టీడివైజ్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల ఒకేసారి మన వాట్సాప్‌ను నాలుగు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. అలాంటి సమయంలో ఒకవేళ వాట్సాప్ కనెక్ట్ చేసిన ఫోన్‌లో డేటా లేకపోయినా.. ఈ డివైజ్‌ల నుండి వాట్సాప్ మాత్రం లాగ్ అవుట్ అవ్వదు. కానీ ఆ డివైజ్‌లకు మాత్రం డేటా ఉండడం తప్పనిసరి.
వాట్సాప్ మల్టీడివైజ్ ఫీచర్‌లో కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి.దీని ద్వారా వెబ్ వాట్సాప్ కనెక్ట్ అయినప్పుడు ఆ డివైజ్‌కు కాల్స్ రావు, దాని నుండి కాల్స్ చేయలేరు. అంతే కాక వాటి నుండి లైవ్ లొకేషన్స్ పంపడం, కంపానియన్ డివైజ్‌లను చూడడటం, చాట్‌లను పిన్ చేయడం, గ్రూప్‌లలో జాయిన్ కావడం, గ్రూప్‌లను చూడటం, గ్రూప్‌లలోకి ఇన్వైట్ చేయడం లాంటివి కూడా చేయలేరు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com