Dhanteras 2022: ధన్తేరాస్ ప్రాముఖ్యత.. ఆ రోజు, బంగారు వెండి వస్తువులు ఎందుకు కొంటారు?

Dhanteras 2022: ధన్తేరాస్ ప్రాముఖ్యత.. ఆ రోజు, బంగారు వెండి వస్తువులు ఎందుకు కొంటారు?
Dhanteras 2022: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దీపావళిని ఈ ఏడాది అక్టోబర్ 24న జరుపుకోనున్నారు. అయితే, ఈ నెల 22,23వ తేదీల్లో ధన్‌తేరస్ వేడుకను జరుపుకుంటున్నారు.

Dhanteras 2022: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దీపావళిని ఈ ఏడాది అక్టోబర్ 24న జరుపుకోనున్నారు. అయితే, ఈ నెల 22,23వ తేదీల్లో ధన్‌తేరస్ వేడుకను జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్‌లో 13వ రోజును సూచించే "ధన్" మరియు "త్రయోదశి" అనే పదాలను "ధనత్రయోదశి" లేదా "ధన్వంతరి త్రయోదశి" అని పిలుస్తారు.

'ధన్తేరాస్' యొక్క ప్రాముఖ్యత

ధన్‌తేరాస్‌లో, కొత్త వంటసామగ్రి లేదా బంగారం, వెండి మరియు నాణేలతో చేసిన ఆభరణాలను కొనుగోలు చేయడానికి ప్రజలు మక్కువ చూపుతుంటారు. అయితే, ఇలా ఎందుకు చేస్తారు అని చాలా మందికి అనుమానం వస్తుంది.

దీపావళి సందర్భాన్ని పురస్కరించుకుని ఆరోజు లక్ష్మీ దేవికి పూజ చేస్తారు. పండుగ కొన్ని రోజుల ముందు నుంచే ఇల్లంతా శుభ్రం చేయడం, కొత్త దుస్తులు కొనుగోలు చేయడం వంటివి చేస్తారు.

జానపద కథల ప్రకారం, రాజు హిమ యొక్క 16 ఏళ్ల కుమారుడు తన జాతకం ప్రకారం అతడి వివాహం జరిగిన నాల్గవ రోజున పాము కాటుకు గురై చనిపోతాడని సూచిస్తుంది. ఆ కారణంగా అతని భార్య.. భర్తని నిద్రపోనివ్వకుండా చూస్తుంది. నిద్రించే గది తలుపు వద్ద, ఆమె తన బంగారు, వెండి ఆభరణాలన్నింటినీ అనేక నాణేలను ఉంచుతుంది. గది నిండా దీపాలు వెలిగిస్తుంది.

ఆ తర్వాత, తన భర్తను మేల్కొని ఉంచే ప్రయత్నంలో, ఆమె అతనికి కథలు చెప్పడం, పాటలు పాడటం ప్రారంభిస్తుంది. మృత్యు దేవుడు యముడు.. పాము రూపంలోకి మారి యువరాజు గదిలోకి వెళ్లబోయాడు. కానీ గది ముందు పేర్చిన దీపాలు, ఆభరణాల ప్రకాశం అతడిని తాత్కాలికంగా అంధుడిని చేసింది. యముడు.. యువరాజు గదిలోకి ప్రవేశించలేకపోయినందున బంగారు ఆభరణాలపై కూర్చొని ఆ రాత్రంతా కథలు, పాటలు వింటూ గడిపాడు.

మరుసటి రోజు ఉదయం వచ్చిన పని మర్చిపోయి మౌనంగా వెళ్లిపోయాడు యముడు. దాంతో యువరాజు మృత్యువు నుండి విముక్తి పొందాడు. ఆ రోజును ధన్తేరస్ అని పిలవడం ప్రారంభించారని పురాణాలు చెబుతున్నాయి. మరుసటి రోజును నరక చతుర్దశి అంటారు.

దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు ధన్వంతరి (దేవతల వైద్యుడు) ఒక రోజున అమృతం కూజాను మోసుకెళ్ళి దాని నుండి బయటపడ్డాడని మరొక పురాణం పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story