Electric scooters : వారం రోజుల్లోనే ఆరు ఘటనలు.. అసలు ఈ-స్కూటర్లు ఎందుకు పేలుతున్నాయ్?

Electric scooters : ఇప్పుడు మార్కెట్లో ఈ-స్కూటర్లకు ఫుల్ డిమాండ్ ఉంది.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెట్రో ధరలు వరుసగా పెరుగుతుండడంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ-స్కూటర్లు వరుసగా పెలుతుండడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.. కేవలం వారం రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా ఆరు ఘటనలు చోటుచేసుకోవడమే దీనికి ప్రధానమైన కారణం.. ఇప్పుడనే కాదు.. గత ఏడాది కూడా ఇలాంటి ఉదంతాలు వెలుగుచూడడంతో... ఇటీవలి ఘటనలు పార్లమెంట్‌లో కూడా ప్రకంపనలు సృష్టించాయి. అసలు ఈ ఈ-స్కూటర్లు ఎందుకు పేలుతున్నాయి. వీటి వెనుకల కారణాలు ఏమై ఉంటాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ప్రధానంగా ఇందులో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలేనని పలువురు ఉత్పత్తిదారులు పేర్కొన్నారు.. లెడ్-యాసిడ్ బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం-అయాన్ బ్యాటరీల నాణ్యత ఎక్కువ.. ఒక కిలో బరువుండే లిథియం-అయాన్ బ్యాటరీలో 150 వాట్-అవర్స్ మేర స్టోరేజీ ఉంటుంది. ఇక లెడ్-యాసిడ్ బ్యాటరీలలో అయితే 25 వాట్-అవర్స్ స్టోరేజీ మాత్రమే ఉంటుంది. ఫుల్‌చార్జింగ్‌కు తక్కువ సమయం తీసుకుంటాయి. ఈ కారణంతో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాపలలో లిథియం-అయాన్‌ను వాడుతున్నారు. అయితే.. ఈ బ్యాటరీల్లో మెకానిజం కొంత క్లిష్టంగా ఉంటుంది. విద్యుత్తు సాంద్రత(డెన్సిటీ) చాలా ఎక్కువ. వీటిల్లో బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ(బీఎంఎస్) ద్వారానే బ్యాటరీ ఫుల్‌చార్జ్ అయ్యిందా? ఇంకా ఎంత బ్యాటరీ చార్జ్ ఉంది? అనే అంశాలు స్మార్ట్‌ఫోన్లలో, ఈ-స్కూటర్ల తెరపై కనిపిస్తాయి.
ఒకవేళ బీఎంఎస్ సరిగ్గా పనిచేయకపోతే.. బ్యాటరీ 90-100 డిగ్రీల స్థాయిలో వేడెక్కినా.. హెచ్చరికలు ఉండవని, బ్యాటరీలు పేలే ప్రమాదాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. వోల్టేజీలో భారీ హెచ్చుతగ్గుల కారణంగా లిథియం-అయాన్ బ్యాటరీలు పేలే ప్రమాదముందని విద్యుత్తు రంగ నిపుణులు అంటున్నారు.. ఎర్త్ లేకుండా బ్యాటరీలను చార్జ్ చేస్తే వైరింగ్ లో లోపాల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదాలు ఉంటాయని అంటున్నారు.. చాలామంది రాత్రిళ్లు ఈ-స్కూటర్లను చార్జింగ్ పెట్టి మరిచిపోయి నిద్రపోతారని, వోల్టేజీలో హెచ్చుతగ్గుల వల్ల ప్రమాదాలు జరుగుతాయని అంటున్నారు.
ఉత్పత్తిదారులు బ్యాటరీలకు టెస్టింగ్ నిర్వహించకపోవడం కూడా ప్రమాదాలకు కారణమని పేర్కొన్నారు. ఉత్పత్తిదారులు బ్యాటరీలకు టెస్టింగ్ నిర్వహించకుండానే మార్కెట్‌కు పంపుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ-స్కూటర్ల ఉత్పత్తిదారులు కూడా డిమాండ్ నేపథ్యంలో.. ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com