అక్షయ తృతీయ నాడు బంగారం ఎందుకు కొంటారు.. ఏంటి ఆ రోజుకు ఉన్న ప్రాముఖ్యత

అక్షయ తృతీయ నాడు బంగారం ఎందుకు కొంటారు.. ఏంటి ఆ రోజుకు ఉన్న ప్రాముఖ్యత
X
అక్షయ తృతీయ.. ఆడవారు బంగారు కొనడానికి క్యూలు కట్టే రోజు.. ఎందుకు ఈ రోజుకు అంత ప్రాముఖ్యత. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆచారం..

అక్షయ తృతీయ.. ఆడవారు బంగారు కొనడానికి క్యూలు కట్టే రోజు.. ఎందుకు ఈ రోజుకు అంత ప్రాముఖ్యత. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆచారం.. ఎప్పటి నుంచి అమలులో ఉంది. మన పూర్వీకులు కూడా ఈ పద్దతిని అనుసరించేవారా వంటి విషయాలన్నీ తెలుసుకుందాం.

అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయడం అదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది. పురాతన హిందూ సంప్రదాయంలో ఇంట్లోకి శ్రేయస్సు కోసం ఆహ్వానం పలికే రోజుగా అక్షయ తృతీయను భావిస్తారు. అక్షయ తృతీయ, విశాఖ మాసంలో చంద్రుని దశ యొక్క మూడవ రోజు హిందూ గృహాలకు అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. కొత్త వెంచర్, నిర్మాణం లేదా వ్యాపారం ఏదైనా ఈ రోజున ప్రారంభిస్తే అంతా శుభమే జరుగుతుందని ఓ నమ్మకం. ప్రారంభానికి రోజు కేటాయించబడింది. ఈ రోజున ప్రారంభమైనది పురోగతికి తక్కువ అడ్డంకులతో నిరవధికంగా పెరుగుతుందని నమ్ముతారు. ప్రజలు ఈ రోజు బంగారంలో పెట్టుబడి పెట్టడం అదృష్టంగా భావిస్తారు.

కుబేరుని అనుగ్రహం పొందే రోజు

ఒకప్పుడు విశ్రావవుని కుమారుడైన కుబేరుడు లంక దేశాన్ని పాలించేవాడు. అతని సవతి సోదరుడైన రావణుడు ఈర్ష్యతో కుబేరుని నుండి నగరాన్ని, ఇతర సంపదలను స్వాధీనం చేసుకుంటాడు. అతనిని లంక నుండి కూడా బహిష్కరిస్తాడు రావణుడు. అనంతరం కుబేరుడు తపస్సు చేసి బ్రహ్మ, మహేశ్వరుల అనుగ్రహాన్ని పొందుతాడు.దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ అతని కోసం కైలాస పర్వతంలో అల్కాపురి అనే అద్భుతమైన నగరాన్ని నిర్మించి ఇస్తాడు. అక్షయ తృతీయ రోజునే కుబేరునికి దేవతల అనుగ్రహం ప్రాప్తించిందని, స్వర్గంలోని సంపద అంతా అతడి అధీనంలోనే ఉండే విధంగా అధిష్టాన దేవతలు చర్యలు తీసుకున్నారని పురాణ గ్రంధాలు వివరిస్తాయి. అందుకే అక్షయ తృతీయ రోజున ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుని పూజించడం వల్ల ఇంటిలో సిరిసంపదలు చేకూరుతాయి. ఈ రోజున కుబేరుడు బంగారాన్ని తిరిగి పొందాడు కాబట్టి, అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం అదృష్టంగా భావిస్తారు.

మహాభారత ఇతిహాసంలోని మరో ఉదంతం అక్షయ తృతీయ ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఒకసారి, శ్రీకృష్ణుడు అరణ్యవాసంలో ఉన్న పాండవుల గృహాన్ని సందర్శిస్తాడు. కృష్ణుడు వారి నిరాడంబర జీవితాన్ని చూసి అచ్చెరువొందుతాడు. ద్రౌపది అతిథిని మంచి విందుతో సత్కరించలేక పోతున్నానన్ని మధన పడుతుంది.

ఆమె ఆంతర్యాన్ని గమనించిన శ్రీకృష్ణుడు వారు ఆహారాన్ని తయారు చేసిన పాత్రకు అంటుకున్న ఒక చిన్న ఆకును స్వీకరించి, వారి ప్రేమ తన ఆకలిని తీర్చిందని చెప్పాడు. పాండవులు సూర్యభగవానుడి నుండి అక్షయపాత్ర పొందుతారని శ్రీకృష్ణుడు వరం ఇచ్చాడు. అక్షయ పాత్ర వారికి అంతులేని ఆహారాన్ని అందించింది. ఈ రోజున ప్రారంభమైనది అనంతంగా పెరుగుతుందని ప్రతీతి. అందుకే ప్రజలు తమ ఇంట్లో సంపద పెరుగుతుందని ఆశతో అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తారు.

Tags

Next Story