Parag Agrawal: ఎలన్ మస్క్ చేతికి ట్విటర్.. సీఈఓగా పరాగ్ తప్పుకోవాల్సిందేనా..?

Parag Agrawal: టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇటీవల ట్విటర్‌ను భారీ పెట్టుబడితో కొనుగోలు చేసిన విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పటినుండో ట్విటర్‌కు ఓనర్ కావాలనుకుంటున్న మస్క.. ఫైనల్‌గా వారు కాదనలేని మొత్తాన్ని ఇచ్చి ట్విటర్ ఓనర్ అయిపోయాడు. ఇక ఎలన్ మస్క్ చేతిలోకి ట్విటర్ వెళ్లినప్పటి నుండి అక్కడి ఉద్యోగులకు లే ఆఫ్ భయం పట్టుకుంది. ఇక ఈ అంశంలో సీఈఓపై కూడా వేటు తప్పదని చాలామంది అనుకుంటున్నారు.
ట్విటర్ ఎలన్ మస్క్ చేతిలోకి వెళ్లడంతో సంస్థలో చాలా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని టాక్ వినిపిస్తోంది. ట్విటర్ కొనుగోలు తర్వాత దాని ఛైర్మన్ బ్రెట్ టేలర్‌తో చర్చలు జరిపాడు మస్క్. ఆ సమయంలో ప్రస్తుతం ఉన్న ట్విటర్ మేనేజ్‌మెంట్‌పై తనకు నమ్మకం లేదని మస్క్ అన్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు అక్కడి ఉద్యోగులందరికీ జాబ్ గురించి ఆందోళన మొదలయ్యింది.
ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన దగ్గర నుండి సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను ఆ పదవి నుండి తొలగిస్తాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. వీటన్నింటిని పరాగ్ ఖండించినా.. ఇంటర్నేషనల్ మీడియా మాత్రం ఇదే నిజమంటోంది. 6 నెలల్లో ట్విటర్ పూర్తిగా ఎలన్ మస్క్ చేతికి వచ్చిన తర్వాత పరాగ్‌ను పదవి నుండి తొలగించాలనే ఆలోచనలో ఉన్నాడట. తనతో పాటు ట్విట్టర్ లీగల్ హెడ్‌గా పనిచేసిన మరో ఇండియన్ విజయ గద్దె జాబ్ కూడా అయెమయంగానే ఉన్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com