జర్మనీ కంపెనీతో విప్రో ఒప్పందం

జర్మనీకి చెందిన మెట్రో ఏజీతో 700 మిలియన్ డాలర్ల విలువైన టేకోవర్ డీల్ కుదుర్చుకున్నట్టు విప్రో ప్రకటించింది. భారతీయ సంస్థలోకి 1300 మంది సిబ్బందిని తరలించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు విప్రో తెలిపింది. మొదటి ఐదేళ్ళ కాలంలో ఈ ఒప్పందం విలువ సుమారు 700 మిలియన్ డాలర్లు. అవసరమైతే అదనంగా మరో 4 సంవత్సరాల కాలానికి ఒప్పందం పొడగించే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్య ఒప్పందం ద్వారా జర్మనీ, రొమేనియాతో భారత్‌లోని 1300మందికి పైగా ఉద్యోగులు విప్రోకు బదిలీ అవుతారు.
మరోవైపు ఈనెల 29 నుంచి విప్రో షేర్ బైబ్యాక్ ఆఫర్ ప్రారంభం కానుంది. ఈ ఇష్యూ జనవరి 11, 2021న ముగియనున్నట్టు కంపెనీ తెలిపింది. గత నెల్లో ఈ బైబ్యాక్ ఇష్యూకు వాటాదారులు అనుమతి తెలిపారు. బైబ్యాక్ ద్వారా ఒక్కో షేరు రూ.400 చొప్పున మొత్తం 23.75 కోట్ల షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది. ఈ బైబ్యాక్ ఆఫర్ విలువ సుమారు రూ.9500 కోట్లు. బైబ్యాక్ ఆఫర్ జోష్‌తో విప్రోకు కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com