బైబ్యాక్ ఆఫర్ ప్రకటించిన విప్రో

బైబ్యాక్ ప్రణాళికలను ఐటీ కంపెనీ విప్రో డైరెక్టర్ల బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.9500 కోట్ల విలువైన షేర్లను బైబ్యాంక్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఒక్కో షేరు రూ.400 చొప్పున మొత్తం 23.75 కోట్ల షేర్లను కంపెనీ బైబ్యాంక్ చేయనుంది. రూ.9500 కోట్లకు మించకుండా ఈ బైబ్యాక్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. సెబీ మార్గదర్శకాల ప్రకారం ఈ బైబ్యాంక్ ఆఫర్ ఉంటుందని తెలిపింది. మంగళవారం ముగింపు ధర రూ.376తో పోలిస్తే 6.6శాతం ప్రీమియంతో విప్రో షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది.
గత ఏడాది కూడా విప్రో షేర్లను బైబ్యాక్ చేసింది. ఒక్కో షేరు రూ.325 చొప్పున రూ.10500 కోట్ల విలువైన 333 మిలియన్ షేర్లను కంపెనీ తిరిగి కొనుగోలు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈఏడాది బైబ్యాంక్ విలువ దాదాపు 10శాతం పైగా తక్కువగా ఉంది.
గత వారం టీసీఎస్ కూడా బైబ్యాంక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఒక్కో షేరే రూ.3వేల చొప్పున మొత్తం రూ.16వేల కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్టు వెల్లడించింది. ఇప్పుడు కూడా విప్రో బైబ్యాంక్‌కు రావడంతో వరుసగా రెండు కంపెనీలు బైబ్యాంక్‌కు వచ్చినట్లయింది. అలాగే మరిన్ని ఐటీ కంపెనీలు కూడా బైబ్యాక్ ప్రణాళికలను రూపొందిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com