WIPRO-AI:ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై విప్రో 100కోట్ల డాలర్ల పెట్టుబడి

WIPRO-AI:ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై విప్రో 100కోట్ల డాలర్ల పెట్టుబడి
2,50,000 ఉద్యోగులకు AIపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడి

భారత అతిపెద్ద ఐటీ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన విప్రో(Wipro) కంపెనీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీపై 100 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మొత్తాన్ని 3 సంవత్సరాల్లో వెచ్చించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఐటీ రంగ కంపెనీలను AI సాంకేతిక చుట్టేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఛాట్‌జీపీటీ(ChatGPT) వంటి ఆవిష్కరణలు ఏఐ ప్రాధాన్యాన్ని వేగం పుంజుకునేలా చేశాయి.

విప్రో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పెట్టుబడులు ముఖ్యంగా కృత్రిమ మేధ, బిగ్ డేటా, అనలటికల్ సొల్యూషన్స్, కొత్త ప్లాట్‌ఫాంల అభివృద్ధి, పరిశోధనలపై పెడతామని వెల్లడించింది. విప్రో ai360 అనే కొత్త సిస్టంని ఆవిష్కరించింది. దీని సాయంతో 2,50,000 ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై వచ్చే 12 నెలల కాలంలో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

అయితే వారం క్రితమే మరో భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 25,000 ఇంజనీర్లకు మైక్రోసాఫ్ట్ అజూర్ ఓపెన్ AIలో శిక్షణ అందిస్తామని వెల్లడించింది.

"జెనరేటివ్ AI విస్తరిస్తున్న ఈ సమయంలో అన్ని సంస్థలు ఆ వైపు మరలుతాయిని అనుకుంటున్నాం " అని విప్రో సీఈవో థెర్రీ డెలాపోర్ట్ వెల్లడించాడు.

గత సంవత్సరం ఛాట్‌జీపీటీ వచ్చిన తర్వాత కృత్రిమమేధ టెక్నాలజీపై పెద్ద పెద్ద సంస్థలన్నీ తమ పెట్టుబడులను రెట్టింపు చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story