Work From Home: ఐటీ ఉద్యోగులు.. గెట్ రెడీ.. ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్..

Work From Home (tv5news.in)

Work From Home (tv5news.in)

Work From Home: కరోనా వచ్చినప్పుడు ఏ రంగానికి అయినా బ్రేక్ పడింది.. ఒక్క ఐటీ రంగానికి తప్ప.

Work From Home: కరోనా వచ్చినప్పుడు ఏ రంగానికి అయినా బ్రేక్ పడింది.. ఒక్క ఐటీ రంగానికి తప్ప. అందరు ఆఫీస్‌లకు వచ్చి పనిచేయడం రిస్క్ కాబట్టి కరోనా ఫస్ట్ వేవ్ కాలంలోనే తమ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' సౌకర్యాన్ని అందించాయి ఐటీ కంపెనీలు. దాదాపు రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులకు తిరిగి ఆఫీస్‌కు రావాలని పిలుపు అందుతోంది.

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కేసులు కాస్త పెరిగేవరకు కూడా ఐటీ ఉద్యోగులు ఆఫీస్‌లకు వెళ్లారు. కానీ ఎప్పుడైతే ఐటీ విభాగంలో కూడా కరోనా కేసులు నమోదవ్వడం మొదలయ్యిందో అప్పటినుండి వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పరిమితమయ్యారు. మధ్యలో పరిస్థితి కాస్త సర్దుమనిగింది. అందుకే ఉద్యోగులను మళ్లీ ఆఫీసులకు పిలవాలన్న ఆలోచనకు వచ్చింది ఐటీ యాజమాన్యం.

వర్క్ ఫ్రమ్ హోమ్ దాదాపు ఎండ్ అయిపోయింది అనుకునే సమయంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చిపడ్డింది. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ మరికొన్ని రోజులు కొనసాగింది. ప్రస్తుతం ఇండియా 100 కోట్ల వ్యాక్సినేషన్ మార్క్‌ను సాధించి.. కరోనా మహమ్మారి నుండి కొంచెంకొంచెంగా బయటపడుతున్న కారణంగా ఐటీ దిగ్గజాలు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని ముగించే ఆలోచన చేస్తున్నాయి.

ప్రముఖ ఐటీ కంపెనీలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్.. గత 18 నెలలుగా వారి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని అందించాయి. ఇక తమ ఉద్యోగులందరినీ త్వరలోనే ఆఫీస్‌లకు పిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా టీసీఎస్.. తమ కంపెనీ ఉద్యోగుల్లో 70% వ్యాక్సిన్ తీసుకున్న కారణంగా వారిని తిరిగి ఆఫీస్‌లకు రమ్మనడానికి నోటీసులు సిద్ధం చేసింది.

వచ్చే ఏడాది మొదట్లో 90% మంది ఉద్యోగులను కంపెనీకి పిలిపిద్దామని అనుకున్న టీసీఎస్.. ఇప్పుడు మనసు మార్చుకుంది. ప్రస్తుతం కేవలం 75%మంది మాత్రమే ఆఫీస్‌లకు రానున్నారని, మిగతా 25% మంది 2025 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే కొనసాగుతారని టీసీఎస్ యాజమాన్యం అంటోంది.

విప్రో మాత్రం తన ఉద్యోగులను కేవలం వారానికి రెండుసార్లు మాత్రమే ఆఫీస్‌కు రావాలని సూచించింది. మిగిలినా రోజులు యథావిధిగా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం ఉంటుంది. ఇక ఇన్ఫోసిస్ కూడా వ్యాక్సినేషన్‌ను దృష్టిలో పెట్టుకుని తమ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఫుల్ స్టాప్ పెట్టనుంది.

Tags

Read MoreRead Less
Next Story