ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్.. ఏకంగా 3 మెర్సిడెస్ కార్లు కొనొచ్చట

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్.. ఏకంగా 3 మెర్సిడెస్ కార్లు కొనొచ్చట
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ పేరు అజాచర్. దీనిని లాస్ ఏంజెల్స్‌కు చెందిన డిజైనర్ అజాచర్ పోగోసియన్ రూపొందించారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ పేరు అజాచర్. దీనిని లాస్ ఏంజెల్స్‌కు చెందిన డిజైనర్ అజాచర్ పోగోసియన్ రూపొందించారు. కార్లు, గడియారాలు, వజ్రాలు, ఫర్నీచర్ వంటి చాలా ఖరీదైన వస్తువుల గురించి తెలుసు. కానీ గోళ్లకు వేసుకునే నెయిల్ పాలిష్ ఇంత రేటు ఉంటుందని ఎన్నడైనా ఊహిస్తామా.. ఈ నెయిల్ పాలిష్ కొనాలంటే మీరు బ్యాంకులో ఉంచుకున్న సేవింగ్స్ అన్నా ఖాళీ అయిపోతాయి. మరి ఈ అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ లో ఏముందో తెలుసుకుందాం.

బ్లాక్ డైమండ్ నెయిల్ పెయింట్ 1 కోటి కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు దీనిని కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ పేరు అజాచర్, దీనిని లాస్ ఏంజెల్స్‌కు చెందిన డిజైనర్ అజాచర్ పోగోసియన్ రూపొందించారు. అతను ప్రపంచవ్యాప్తంగా తన లగ్జరీ వస్తువులకు బాగా ప్రాచుర్యం పొందాడు.

దూరం నుండి చూసినప్పుడు ఈ నెయిల్ పాలిష్ మామూలుగా అనిపించవచ్చు కానీ మీరు నిశితంగా పరిశీలిస్తే దానిలో 267 క్యారెట్ బ్లాక్ డైమండ్ కనిపిస్తుంది. ఇందుకు మీకు రూ. 1,63,66,000 ఖర్చు అవుతుంది. ఇది 14.7 మిల్లీలీటర్ల రిట్జీ డిజైన్‌ను కలిగి ఉంది, దీని ధర రూ. 1,59,83,750. ధర చాలా ఎక్కువగా ఉంది, దీని ధర సుమారు రూ. 50 లక్షలు. ఈ డబ్బుతో 3 Mercedes-Benz GLA కొనుగోలు చేయవచ్చు.

ఎవరైనా కొనుగోలు చేసే ముందు అది అవసరమా కాదా అని ఒకటికి పది సార్లు ఆలోచించమంటారు. కానీ ఎవరూ చేయని పని మనం కదా చేయాలి అని అనుకుంటే , మీ దగ్గర బాగా డబ్బులుంటే తప్పు లేదు కొనుక్కోవచ్చు. ఇప్పటివరకు 25 మంది ఈ బ్లాక్ డైమండ్ నెయిల్ పాలిష్‌ను కొనుగోలు చేశారట. మరి ఆ లిస్ట్ లో మీరు కూడా చేరతామంటే మాకేంటి అభ్యంతరం.

Tags

Next Story