YEAR END: చిన్న షేర్లకు అచ్చిరాని 2025

YEAR END: చిన్న షేర్లకు అచ్చిరాని 2025
X
రాణించని స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు... పరుగులు పెట్టిన సెన్సెక్స్‌, నిఫ్టీ... ప్రభావం చూపిన రూపాయి.. పెట్టుబడులపై చిన్న మదుపర్ల వెనక్కి..

ఈ ఏడా­ది దే­శీయ స్టా­క్‌ మా­ర్కె­ట్ల­లో లా­ర్జ్‌­క్యా­ప్‌ ఇం­డె­క్స్‌ల హవా­నే నడి­చిం­ది. స్మా­ల్‌, మి­డ్‌­క్యా­ప్‌ సూ­చీ­లు ని­రా­శ­ప­ర్చా­యి. ము­ఖ్యం­గా చి­న్న షే­ర్లు కు­దే­ల­య్యా­యి. జన­వ­రి 1 నుం­చి డి­సెం­బ­ర్‌ 24 వరకు చూ­సి­నై­ట్టె­తే స్మా­ల్‌­క్యా­ప్‌ ఇం­డె­క్స్‌ 6.68 శాతం నష్ట­పో­యిం­ది. మి­డ్‌­క్యా­ప్‌ కూడా కే­వ­లం 0.77 శాతం పె­రు­గు­ద­ల­నే చూ­సిం­ది. ఇదే సమ­యం­లో బ్లూ­చి­ప్‌ షే­ర్ల సూచీ సె­న్సె­క్స్‌ 9.30 శాతం పుం­జు­కో­వ­డం గమ­నా­ర్హం. 2023, 2024లో వరు­స­గా రెం­డేం­డ్లు స్మా­ల్‌, మి­డ్‌­క్యా­ప్‌ సూ­చీ­లు అద­ర­గొ­ట్టా­యి. గత ఏడా­ది స్మా­ల్‌­క్యా­ప్‌ 29 శా­తా­ని­కి­పై­గా ఎగి­సిం­ది. మి­డ్‌­క్యా­ప్‌ సైతం 26 శాతం ఎగ­బా­కిం­ది. సె­న్సె­క్స్‌­ను మిం­చి మదు­ప­రు­ల­కు లా­భా­ల­ను పం­చి­పె­ట్టా­యి. ఈ నే­ప­థ్యం­లో ఈ ఇం­డె­క్స్‌­ల­లో పె­ట్టు­బ­డు­లు పె­ట్టిన మదు­ప­రు­లు ఈ ఏడా­ది లా­భాల స్వీ­క­ర­ణ­కు మొ­గ్గు చూ­పా­ర­ని ని­పు­ణు­లు 2025 మా­ర్కె­ట్‌ సర­ళి­ని వి­శ్లే­షి­స్తు­న్నా­రు. దీ­న్ని వారు మా­ర్కె­ట్‌ నా­ర్మ­లై­జే­ష­న్‌­గా అభి­వ­ర్ణి­స్తు­న్నా­రు. మరి­కొం­ద­రు ఎక్స్‌­ప­ర్ట్స్‌.. స్మా­ల్‌, మి­డ్‌­క్యా­ప్‌ల నుం­చి తమ పె­ట్టు­బ­డు­ల­ను ఇన్వె­స్ట­ర్లు లా­ర్జ్‌­క్యా­ప్‌ షే­ర్ల­లో­కి మా­ర్చా­ర­ని, అం­దు­కే ఈ ఏడా­ది చి­న్న, మధ్య­శ్రే­ణి షే­ర్ల సూ­చీ­లు ఆశిం­చిన స్థా­యి­లో రా­ణిం­చ­లే­క­పో­యా­య­ని అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. అం­త­ర్జా­తీయ అని­శ్చిత స్థి­తి­లో­నూ బడా సం­స్థ­లు బల­మైన బ్యా­లె­న్స్‌ షీ­ట్ల­ను, స్థి­ర­మైన లా­భా­ల­ను చూ­ప­డం కలి­సొ­చ్చిం­ద­ని చె­ప్తు­న్నా­రు. దేశ, వి­దే­శీ ఒడి­దు­డు­కు­లు స్మా­ల్‌, మి­డ్‌­క్యా­ప్‌ సం­స్థ­ల­ను ఎక్కు­వ­గా ప్ర­భా­వి­తం చే­శా­య­ని అం­టు­న్నా­రు. భా­ర­తీయ ఇన్వె­స్ట­ర్లు చి­న్న షే­ర్ల­ను కొ­న్న­ప్ప­టి­కీ.. వి­దే­శీ మదు­ప­రు­లు పె­ద్ద షే­ర్ల­పై­నే ఆస­క్తి కన­బ­ర్చా­ర­ని, ఇది­కూ­డా దె­బ్బ­తీ­సిం­ద­ని మె­జా­రి­టీ మా­ర్కె­ట్‌ అన­లి­స్టు­లు పే­ర్కొం­టు­న్నా­రు.

ఈ ఏడా­ది నవం­బ­ర్‌ 18న బీ­ఎ­స్‌ఈ మి­డ్‌­క్యా­ప్‌ సూచీ 52 వా­రాల గరి­ష్ఠ స్థా­యి­ని తా­కు­తూ 47,549.40 పా­యిం­ట్ల­కు చే­రిం­ది. 2024 సె­ప్టెం­బ­ర్‌ 24న ఆల్‌­టై­మ్‌ హై 49,701.15 వద్ద ఉన్న వి­ష­యం తె­లి­సిం­దే. ఇక బీ­ఎ­స్‌ఈ స్మా­ల్‌­క్యా­ప్‌ ఇం­డె­క్స్‌ ఈ ఏడా­ది జన­వ­రి 3న ఏడా­ది గరి­ష్ఠ స్థా­యి­ని తా­కు­తూ 56,497.39 పా­యిం­ట్ల వద్ద­కు వె­ళ్లిం­ది. అలా­గే ఏప్రి­ల్‌ 7న 52 వా­రాల కని­ష్ఠా­న్ని తా­కు­తూ 41,013.68 పా­యిం­ట్ల­కు పడి­పో­యిం­ది. 2024లో బీ­ఎ­స్‌ఈ స్మా­ల్‌­క్యా­ప్‌ సూచీ 12,506.84 పా­యిం­ట్లు లేదా 29.30 శాతం పె­రి­గిం­ది. అలా­గే మి­డ్‌­క్యా­ప్‌ ఇం­డె­క్స్‌ 9,605.44 పా­యిం­ట్లు లేదా 26.07 శాతం ఎగి­సిం­ది. 2023లో బీ­ఎ­స్‌ఈ స్మా­ల్‌­క్యా­ప్‌ 13,746.97 పా­యిం­ట్లు లేదా 47.52 శాతం, మి­డ్‌­క్యా­ప్‌ 11,524.72 పా­యిం­ట్లు లేదా 45.52 శాతం పుం­జు­కు­న్నా­యి. 2022లో స్మా­ల్‌­క్యా­ప్‌ 530.97 పా­యిం­ట్లు లేదా 1.80 శాతం నష్ట­పో­గా, మి­డ్‌­క్యా­ప్‌ 344.42 పా­యిం­ట్లు లేదా 1.37 శాతం పె­రి­గిం­ది. కాగా, సె­న్సె­క్స్‌­లో నమో­దైన కం­పె­నీ మా­ర్కె­ట్‌ వి­లు­వ­లో ఐదో వంతు ఉంటే మి­డ్‌­క్యా­ప్‌ ఇం­డె­క్స్‌­లో, పదో వంతు ఉంటే స్మా­ల్‌­క్యా­ప్‌ ఇం­డె­క్స్‌­లో షే­ర్లు ట్రే­డ్‌ అవు­తా­య­న్న సం­గ­తి వి­ది­త­మే. సె­న్సె­క్స్‌ 2023లో 11,399.52 పా­యిం­ట్లు లేదా 18.73 శాతం, 2022లో 2,586.92 పా­యిం­ట్లు లేదా 4.44 శాతం లా­భ­ప­డిం­ది. ఈ ఏడా­ది ఫి­బ్ర­వ­రి నుం­చి భా­ర­త్‌-అమె­రి­కా వా­ణి­జ్య ఒప్పం­దం­పై సం­ది­గ్ధత నె­ల­కొ­న్న­ది. ఇక ఫా­రె­క్స్‌ మా­ర్కె­ట్‌­లో అం­త­కం­త­కూ దే­శీయ కరె­న్సీ రూ­పా­యి మా­ర­కం వి­లువ బల­హీ­న­ప­డి­పో­తు­న్న­ది చూ­స్తూ­నే ఉన్నాం. ప్ర­ధా­నం­గా ఈ రెం­డిం­టి ప్ర­భా­వం వల్లే మదు­ప­రు­లు కొ­ను­గో­ళ్ల­ను పక్క­న­పె­ట్టి లా­భాల స్వీ­క­ర­ణ­కు ది­గు­తు­న్నా­ర­ని మా­ర్కె­ట్ ని­పు­ణు­లు తె­లి­పా­రు. ని­ఫ్టీ 500 సూ­చీ­లో­ని కం­పె­నీ­ల్లో 30 కం­పె­నీల షే­ర్లు 52 వా­రాల కని­ష్ఠాల నుం­చి గణ­నీ­యం­గా పుం­జు­కు­న్నా­యి.

Tags

Next Story