YEAR END: భారత ఆర్థిక వ్యవస్థను శాసించిన కంపెనీలు

భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న బ్యాంకింగ్, ఎనర్జీ, టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాల్లోని దిగ్గజ కంపెనీలు 2025 సంవత్సరం ముగిసే సమయానికి మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) ఆధారంగా అగ్రస్థానంలో నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు, టెలికాం, ఐటీ, ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజాలు టాప్ 10 జాబితాలో ఉన్నాయి.
మార్కెట్ విలువలో భారత అగ్రగామి కంపెనీలు (2025 చివరి నాటికి)
భారతదేశ ఆర్థిక రంగాన్ని శాసించిన టాప్ 9 కంపెనీల జాబితా, వాటి మార్కెట్ విలువలు ఆధారంగా..
* రిలయన్స్ ఇండస్ట్రీస్ -రూ.20.85 లక్షల కోట్లు
* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- రూ.15.87 లక్షల కోట్లు
* భారతీ ఎయిర్‌టెల్-రూ.12.84 లక్షల కోట్లు
* టీసీఎస్ -రూ.11.65 లక్షల కోట్లు
* ఐసీఐసీఐ బ్యాంక్ -రూ.9.95 లక్షల కోట్లు
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -రూ.7.65 లక్షల కోట్లు
* ఇన్ఫోసిస్ -రూ.6.71 లక్షల కోట్లు
* బజాజ్ ఫైనాన్స్-రూ.6.33 లక్షల కోట్లు
* లార్సెన్ & టూబ్రో (L&T)- రూ.5.42 లక్షల కోట్లు
ఎనర్జీ, టెలికాం ఆధిపత్యం
రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) రూ.20.85 లక్షల కోట్లతో భారత మార్కెట్ క్యాప్ కిరీటాన్ని నిలబెట్టుకుంది. ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోకెమికల్స్, జియో (టెలికాం), రిటైల్ వంటి విభిన్న రంగాల్లో RIL తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. భారతీ ఎయిర్‌టెల్ రూ.12.84 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలవడం టెలికాం రంగంలో దాని స్థిరమైన వృద్ధిని సూచిస్తుంది. మెట్రో నగరాల్లో 5G విస్తరణ, ఎంటర్‌ప్రైజ్ సేవల్లో విస్తరణ ఎయిర్‌టెల్ వృద్ధికి ప్రధాన కారణాలు.
బ్యాంకింగ్ దిగ్గజాలు
మార్కెట్ క్యాప్‌లో బ్యాంకింగ్ రంగం అగ్రభాగాన నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ₹ 15.87 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రెండో స్థానంలో నిలిచిన ఈ సంస్థ, రూ.16.5 లక్షల కోట్ల బలమైన డిపాజిట్ బేస్‌తో భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా ఉంది. రూ . 9.95 లక్షల కోట్లతో ఐదో స్థానంలో నిలిచిన ఐసీఐసీఐ, 120 మిలియన్ల రిటైల్ కస్టమర్లతో డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌లో దూసుకుపోతోంది. ఇక రూ,7.65 లక్షల కోట్లతో ఆరో స్థానంలో ఉన్న ఎస్బీఐ, ప్రభుత్వ మద్దతు, స్థిరమైన నిధులతో దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా నిలిచింది.
ఐటీ రంగంలో పోటీ
ఐటీ రంగంలో నిలకడగా పనితీరు కనబరిచిన రెండు దిగ్గజాలు అగ్రస్థానంలో ఉన్నాయి. టీసీఎస్ .. రూ.11.65 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. మార్కెట్ క్యాప్, ఉద్యోగుల సంఖ్య పరంగా ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ. ఇక ఇన్ఫోసిస్ రూ.6.71 లక్షల కోట్లతో ఏడో స్థానంలో నిలిచింది. గ్లోబల్ డిజిటల్ సొల్యూషన్స్‌ను అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

