PPF: పీపీఎఫ్ చందాదారులు.. ప్రతి నెలా 5వ తేదీలోపు..

PPF: పీపీఎఫ్ చందాదారులు.. ప్రతి నెలా 5వ తేదీలోపు..
PPF: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) పథకం పన్ను ఆదా, రాబడి మరియు భద్రత కలయిక కారణంగా దేశంలో చాలా ప్రజాదరణ పొందిన దీర్ఘకాలిక పొదుపు పథకం.

PPF: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) పథకం పన్ను ఆదా, రాబడి మరియు భద్రత కలయిక కారణంగా దేశంలో చాలా ప్రజాదరణ పొందిన దీర్ఘకాలిక పొదుపు పథకం.PPF పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఆకర్షణీయమైన వడ్డీ రేటును, రాబడిని అందిస్తుంది. సంపాదించిన వడ్డీ మరియు రాబడిపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.

అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ప్రతినెలా ఐదో తేదీలోపు పెట్టుబడి పెట్టాలి. PPF నియమం ప్రకారం, పెట్టుబడిదారులు తమ వాయిదాలను ప్రతినెలా ముందు లేదా ఐదవ తేదీన డిపాజిట్ చేయాలి. PPF డిపాజిట్లపై వడ్డీ ఐదవ మరియు నెలాఖరు మధ్య కనీస బ్యాలెన్స్‌పై లెక్కించబడుతుంది. ఆ తరువాత జమ చేసిన మొత్తానికి ఆ నెల వడ్డీ వర్తించదు.

ప్రతి నెలా చివరి రోజు నుంచి ఆ తర్వాతి నెల 5వ తేదీ వరకు ఖాతాలో ఉన్న నగదును పరిగణలోకి తీసుకుని వడ్డీ లెక్కిస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. 5వ తేదీ తర్వాత పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్దగా తేడా ఉండదని మీరు భావించవచ్చు. కానీ చిన్న చిన్న మొత్తాలే దీర్ఘకాలంలో పెద్ద మొత్తం సమకూర్చి పెడతాయని మర్చిపోకూడదు. 5వ తేదీ కంటే ముందు పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడి జమ చేస్తే వడ్డీ రేట్ల ప్రయోజనంతో పాటు, పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉంటుంది.

5వ తేదీనే ఎందుకంటే.. ఉద్యోగస్తులకు 5లోపు జీతాలు అందుతాయి. కాబట్టి ఆ లోపు జమ చేసేందుకు వీలుంటుంది. ఐదు రోజుల్లో జమ చేస్తే మిగతా 25 రోజులకు వడ్డీ వర్తిస్తుంది. దీంతో పాటు సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఏడాదికి పీపీఎఫ్ ఖాతాలో రూ.1,50,000 జమ చేస్తే సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే దీనికోసం ప్రతి నెలా కూ.12,500 జమ చేస్తే మంచిది.

ప్రతి నెలా 5వ తేదీ కంటే ముందు రూ.12,500 జమ చేస్తే 15 ఏళ్ల కాలపరిమితి పూర్తయ్యే నాటికి దాదాపు రూ.40 లక్షలు సమకూర్చుకోవచ్చు. పీపీఎఫ్ ఖాతాలో ఏడాదికి రూ.500 నుంచి రూ.1,50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. 15 ఏళ్ల కాల పరిమితి పూర్తయిన తరువాత కూడా ఖాతాను కొనసాగించవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story