Zee Sony: జత కట్టిన జీ సోనీ.. విలీనం ఖరారు

Zee Sony: జత కట్టిన జీ సోనీ.. విలీనం ఖరారు
Zee Sony: ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అతిపెద్ద విలీనం ఖరారైంది.

Zee Sony: - విలీనం కోసం సోనీపిక్చర్స్‌తో నెట్‌వర్క్స్‌ ఇండియాతో ముగిసిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 90 రోజుల చర్చలు

- కొలిక్కి వచ్చిన చర్చలు, విలీనం దాదాపు ఖరారు

- జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య ఒప్పందం

- జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 100 షేర్లకు 85 సోనీ షేర్లు

- త్వరలో ఖరారు కానున్న తుది నిబంధనలు

- 26.5 కోట్ల తాజా షేర్లను జారీ చేయనున్న కంపెనీ

- భారతీయ చరిత్రలో అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థల విలీనం

- విలీనం తర్వాత కంపెనీ ఎండీ, సీఈఓగా కొనసాగనున్న పునీత్‌ గోయెంకా

- విలీనం తర్వాత బోర్డులో కొనసాగనున్న మెజార్టీ సోనీ సభ్యులు

- విలీనం తర్వాత సోనీకి 50.86శాతం వాటా, ఎస్సెల్‌కు 3.99 వాటా, ఇతర ఇన్వెస్టర్లకు 45.15 శాతం వాటా

ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అతిపెద్ద విలీనం ఖరారైంది. కొంతకాలంగా వివాదాలు, కేసులతో సవాళ్ల మధ్య సాధ్యమవుతుందా అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఎట్టికేలకు Zee Entertainment Enterprises Ltd (ZEEL) డైరెక్టర్ల బోర్డు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా SPNIలో విలీనానికి ఆమోదం తెలిపింది. తాజా ఒప్పందంతో సోనీకి సంస్థలో 50.86 శాతం వాటా దక్కనుంది. ZEEL ప్రమోటర్లు 3.99 శాతం,షేర్ హోల్డర్స్ వాటాలు 45.15 శాతంగా ఉంటాయి. ప్రస్తుతం టీవీ కంటెంట్ డెవలప్‌మెంట్, రీజనల్, ఇంటర్నేషనల్ శాటిలైట్ టెలివిజన్ ఛానెల్‌లు, సినిమాలు, మ్యూజిక్, డిజిటల్ వ్యాపారం ప్రసారాల్లో ఉన్న జీ సంస్థ ఇక సోనీ నియంత్రణలోకి పోతుంది. MDగా గోయెంకా

విలీనంలో భాగంగా సంస్థ MD మరియు CEOగా పునీత్ గోయెంకా నియామకానికి సోనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెజారిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సోనీ గ్రూప్ నుంచి ఉన్నా కీలక పదవిలో మాత్రం గోయాంకా ఉంటారు. రెండు సంస్థల మధ్య విలీనాన్ని సెప్టెంబర్ 22నఅధికారికంగా ప్రకటించారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 90 రోజుల వ్యవధి పడుతుందని కంపెనీ ప్రకటించింది. మార్కెట్లో పాగా..

తాజా ఒప్పందం ప్రకారం సోనీకి 1.5 బిలియన్ల డాలర్ల నగదు నిల్వ అందుబాటులోకి వస్తుంది. దీంతో ఈ ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్ సృష్టిని అవసరమైన నిధులు సిద్దంగా ఉన్నట్టే. పోటీలో దూసుకుపోవడానికి అవకాశాలు మెరుగుపడ్డాయి. ప్రధానంగా హాట్ స్టార్, అమోజాన్ వంటి సంస్థల నుంచి వస్తున్న పోటీలో నిలబడేందుకు ఈ డీల్ కీలకం. వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ ల్యాండ్‌స్కేప్‌లో హక్కులు విషయంలో కూడా కంపెనీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ విలీనం 26 శాతం వ్యూయర్‌షిప్ షేర్‌తో భారతదేశంలో అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్‌ను సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. టీవీలో టాప్ జానర్ అయిన హిందీ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ (GEC) విభాగంలో Q1FY22 డేటా ప్రకారం Zee-Sony కలిపి 51 శాతం వాటాను ఉంది. Zee-Sony సంస్థ 63 శాతం వీక్షకుల వాటాను సొంతం చేసుకుంటుందని అంచనా. సవాళ్ల మధ్య...

Zee మరియు Sony విలీనానికి ఒప్పందాలపై సంతకం చేసినప్పటికీ, జీ కంపెనీలో 18 శాతం వాటా కలిగి ఉన్న Invesco అభ్యంతరాలపై ఎలా పరిష్కరిస్తారన్నది చూడాలి. జీ విలీనంపై ఇన్వాస్కో తీవ్ర అభ్యంతరం తెలిపింది. జీ తీసుకున్న నిర్ణయాలపై కోర్టుకు కూడా వెళ్లింది. ప్రధానంగా అతి తక్కవు వాటా ఉన్న ప్రమోటర్ గోయెంకా ఎండీగా ఉండటాన్ని కంపెనీ తప్పుబట్టింది. ఇరువురు షేర్ హోల్డర్స్ కు లేఖలు రాశారు. కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో విలీనం ప్రక్రియ ఆగిపోతుందని చర్చ జరిగింది. కానీ చివరకు గోయెంకా విలీనంపై పట్టుబట్టి సాధించారు.


Tags

Read MoreRead Less
Next Story