Zomato CEO: కంపెనీకి సీఈవో.. అయినా మూడు నెలలకు ఓసారి..

Zomato CEO: ఓ కంపెనీకి సీఈవో అంటే ఆ దర్పమే వేరుంటుంది. రోజు ఉద్యోగులతో చర్చించడం.. వ్యాపార విస్తరణకు ప్లాన్ సిద్దం చేయడం వంటి వాటితో బీజిగా ఉంటారు. కానీ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సీఈవో.. కంపెనీ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ మాత్రం ఇందుకు అతీతం. తన బాధ్యతలు నిర్వహిస్తూనే .. సాధారణ డెలివరీ బాయ్‌గా అవతారమెత్తాడు.
రెడ్ షర్ట్ వేసుకొని.. బైక్‌మీద ఫుడ్ డోర్‌డెలివరీ చేస్తున్నాడు. ఎప్పుడో ఒకసారికాదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి..ఈ పనిచేస్తున్నాడు. నౌకరీ డాట్‌కామ్ యజమాని సంజీవ్ బిక్ చందానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ట్వీటర్ ద్వారా బయటపెట్టారు.
కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్ ఫుడ్ డెలివరీ చేస్తుంటే... కంపెనీలో పనిచేసే సీనియర్ ఉద్యోగులు సైతం ఆయన బాటపట్టారు. మేనేజర్లందరూ ఇదే తరహాలో ప్రతి మూడు నెలలకోసారి డెలివరీ బాయ్ అవతారం ఎత్తుతున్నారు. వారు రోజంతా ఫుడ్ డెలివరీలు చేస్తుంటారని సంజీవ్ బిక్ పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లుగా దీపిందర్ ఇదే పనిచేస్తున్నారని వివరించారు.
అయినా ఇప్పటి వరకు తనను ఎవరూ గుర్తు పట్టలేదని దీపిందర్ తనతో చెప్పినట్లు సంజీవ్ వెల్లడించారు. సంజీవ్ ట్వీట్ చూసిన నెటిజన్లు జొమాటో సీఈఓపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ ఫుడ్‌ను ఆయన డెలివరీ చేస్తే చూడాలని ఆసక్తిగా ఉందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. వినియోగదారుల అభిప్రాయాలతోపాటు.. క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల బాధలు అర్థం చేసుకోవడానికే ఈ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com