Zomato IPO: ఇన్వెస్టర్లకు అదిరిపోయే రిటర్న్స్‌..!

Zomato IPO: ఇన్వెస్టర్లకు అదిరిపోయే రిటర్న్స్‌..!

Zomato File Photo

Zomato IPO: ఎంతో ఉత్కంఠతో ఉత్సాహంతో ఎదురుచూసిన జొమాటో ఐపీఓ ఇన్వెస్టర్లకు అదిరిపోయే రిటర్న్స్‌ ఇచ్చింది.

Zomato IPO: ఎంతో ఉత్కంఠతో ఉత్సాహంతో ఎదురుచూసిన జొమాటో ఐపీఓ ఇన్వెస్టర్లకు అదిరిపోయే రిటర్న్స్‌ ఇచ్చింది. 52 శాతం ప్రీమియంతో 116 రూపాయల వద్ద ఈ స్టాక్‌ బంపర్‌ లిస్ట్‌ కావడంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ స్టాక్‌ ట్రెండ్‌ ఎలా ఉండొచ్చు? మార్కెట్‌ విశ్లేషకులు ఏమంటున్నారో తెలుసుకోవాలంటే వాచ్‌ దిస్‌ స్టోరీ..

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన జొమాటో ఐపీఓ.. టు వర్కింగ్‌ డేస్‌ ముందే స్టాక్‌ మార్కెట్లో లిస్టైంది. ఇష్యూ ప్రైస్‌ 76 రూపాయలు కాగా లిస్టింగ్ తొలిరోజే 40 రూపాయల ప్రీమియంతో 116 వద్ద లిస్టైన ఈ స్టాక్‌ లాభాల బోణీ కొట్టింది. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభమైన 5 నిమిషాల్లోనే జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్‌ లక్ష కోట్ల రూపాయల మార్క్‌ను క్రాస్‌ చేసింది.

జొమాటో పబ్లిక్‌ ఇష్యూ విషయంలోనే కాదు, మార్కెట్ క్యాపిటలైజేషన్‌ పరంగానూ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓపెనింగ్ రోజే లక్ష కోట్ల రూపాయల మార్కెట్ కేపిటలైజేషన్ సాధించిన తొలి కంపెనీగా ఆవిర్భవించిన ఈ కంపెనీ... ఇండియన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో టాప్‌-100 మోస్ట్‌ వాల్యూడ్‌ లిస్టెడ్‌ కంపెనీల జాబితాలోనూ స్థానం సంపాదించింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ శ్రీ సిమెంట్‌, ఐఓసీ, బీపీసీఎల్‌ తదితర కంపెనీల కంటే ఎక్కువగా ఉంది.

స్టాక్‌ మార్కెట్లో ఇప్పుడు లిస్టింగ్‌ గెయిన్స్‌ మేనియా నడుస్తుండటంతో జొమాటోలో పాక్షికంగా అయినా ప్రాఫిట్‌ బుక్‌ చేసుకోమని మార్కెట్‌ ఎనలిస్టులు సూచిస్తున్నారు. కంపెనీ వాల్యుయేషన్ కాస్త ఎక్కువగా ఉండటమే దీనికి కారణంగా వారు చెప్తున్నారు. అయితే లాంగ్‌టర్మ్‌లో కంపెనీ ఫ్యూచర్‌కి ఢోకా లేదని వారు అంచనా వేస్తున్నారు. ఇక రిటైల్‌ ఇన్వెస్టర్లు అధిక చూపడంతో ట్రేడింగ్‌ తొలిరోజు జొమాటోలో అదిరిపోయే వాల్యూమ్స్‌ నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story