zomato: టాటా మోటర్స్‌కే అంత వీజీ కాలేదు.. సింగిల్‌డేలో జొమేటో..

zomato: టాటా మోటర్స్‌కే అంత వీజీ కాలేదు.. సింగిల్‌డేలో జొమేటో..
మార్కెట్లలో లిస్ట్ అయి ఏళ్లు గడిచినా కూడా కొన్ని దిగ్గజ కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్ అంత సునాయాసంగా లక్ష కోట్లు దాటలేదు. ఐతే జొమేటో మాత్రం చాలా ఈజీగా ఆ ఫీట్ సాధించింది.

zomato: స్టాక్ మార్కెట్లలో లాభం తెచ్చి పెట్టే కంపెనీలే కాదు, తరతరాలుగా దాచుకోవాల్సిన షేర్లు అని కూడా కొన్ని స్టాక్స్‌ని చెప్తుంటారు. ఐతే అలాంటి కంపెనీలకే అంత తొందరగా సాధ్యపడని బ్రహ్మాండమైన ఫీట్‌ని జొమేటో లిస్టింగ్ రోజునే సాధించింది. మార్కెట్లలో లిస్ట్ అయి ఏళ్లు గడిచినా కూడా కొన్ని దిగ్గజ కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్ అంత సునాయాసంగా లక్ష కోట్లు దాటలేదు. ఐతే జొమేటో మాత్రం చాలా ఈజీగా ఆ ఫీట్ సాధించింది. రేపొద్దున మార్కెట్లలో ఈ కంపెనీ షేరు ధర ఏ రెండు వందల రూపాయల యాభయ్యో అయిందంటే రూ.2లక్షల కోట్ల కేపిటలైజేషన్ కూడా సాధిస్తుంది.

ఉదాహరణకు టాటా మోటర్స్ స్టాక్( రూ.295.80) మార్కెట్ కేపిటలైజేషనే చూడండి. దాని వేల్యూ రూ.98,181కోట్లు ఉంది. గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్(రూ.975.80) ఎంత పెద్ద కంపెనీ, దాని పోర్ట్‌ఫోలియోలో ఎన్ని ఉత్పత్తులు ఉంటాయో, వాటిలో రోజూ మనం ఎన్నివాడుతుంటామో అయినా కూడా ఆ కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.99273కోట్లు మాత్రమే. శ్రీసిమెంట్స్(రూ.27,977.60) మార్కెట్ కేపిటలైజేషన్ రూ.99695కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(రూ.105.80)M-cap కూడా అంతే.

మరో ప్రభుత్వరంగ దిగ్గజ చమురు కంపెనీ బిపిసిఎల్ (రూ.461.35)మార్కెట్ కేపిటలైజేషన్ రూ.99785కోట్లు ఇవే కాదు ఇంకా కోల్గేట్, సెయిల్,ఎన్ఎండిసి, హీరోమోటోకార్ప్,గెయిల్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ ,సిప్లా, డాక్టర్ రెడ్డీస్ కూడా లక్ష కోట్ల మార్కెట్ కేప్‌లోపే ఉండగా, జొమేటో వాటిని సైడ్ చేసి లిస్టులోకి చేరడం విశేషం. పైన చెప్పిన కంపెనీల షేర్ల ధరల కదలికల ఆధారంగా మార్కెట్ కేపిటలైజేషన్ పెరుగుతుంది, తగ్గుతుంది, ఐతే ఈ లక్ష కోట్ల మార్కెట్ కేపిటలేజేషన్ సాధించడానికి ఈ కంపెనీలకు కనీసం ఐదారేళ్లు, కొన్నిటికి అయితే దశాబ్ద కాలం కూడా పట్టి ఉండవచ్చు.

కానీ జొమేటో మాత్రం మొదటి అడుగుతోనే లక్షకోట్లతో ప్రారంభించడం అద్భుతం. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కంపెనీ రెవెన్యూ మోడలే ఇందుకు కారణం. కరోనా కాలంలోనూ ఫుడ్ డెలివరీకి ఢోకా లేకపోవడం, రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ డిమాండ్‌ని అందిపుచ్చుకునే రంగం కావడంతోనే, ఈ ఫుడ్ డెలివరీ ఆగ్రిగేటర్‌కి ఇంత డిమాండ్ వచ్చింది. దానికి తోడు ఇష్యూ సైజ్ పెద్దది కావడంతోపాటు..ఎక్కువమంది పార్టిసిపేట్ చేసేందుకు అవసరమైన రిటైల్ పోర్షన్, దానికి తగినట్లుగానే ఇన్వెస్టర్లు ఈ న్యూ ఏజ్ ఫుడ్ టెక్ స్టార్టప్‌పై మంచి ఇంట్రస్ట్ పెట్టడంతో హెవీ వాల్యూమ్స్ నమోదు అవుతున్నాయ్.

అందుకే పైన చెప్పిన టాటా మోటర్స్, శ్రీ సిమెంట్స్, గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్,బిపిసిఎల్ షేరు ధర జొమేటో కంటే ఎక్కువే అయినా కూడా మార్కెట్ కేప్ పరంగా వెనకబడ్డాయ్. ఐతే జొమేటో షేరు ధర రూ.132 పైన ఉంటేనే ఈ లక్ష కోట్ల మార్కెట్ కేప్ మార్క్ నిలబడుతుంది లేదంటే దిగువకు జారుతుందనేది గుర్తుపెట్టుకోవాలి అలా మొదట అడుగే లక్షకోట్లతో ప్రారంభమైన జొమేటో జర్నీ నెక్స్ట్ ఏ లెవల్‌కి చేరుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది


Tags

Read MoreRead Less
Next Story