క్షతగాత్రుల సేవలో టీడీపీ

ఒడిశాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం దురదృష్టకరమని అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు. క్షతగాత్రులకు సహాయసహకారాలు అందించడానికి టీడీపీ తరపున ఎమ్మెల్యే బెందాలం అశోక్, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను నియమించడం జరిగిందని చెప్పారు. వీరిరువురు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ సహకారాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ శ్రేణులు క్షతగాత్రులకు సహాయం చేసేందుకు ముందుకురావాలని అచ్చెన్నాయుడు  కార్యకర్తలను కోరారు. నాయకుడి ఆదేశాలతో క్షతగాత్రులకు సహాయం చేసేందుకు ఘటనా స్థలానికి తరలి వెళ్లారు టీడీపీ కార్యకర్తలు. ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడం దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోవడం దేశ చరిత్రలోనే అత్యంత పెద్ద దుర్ఘటన.

Tags

Next Story