ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్ షాతో మీటింగ్

ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్ షాతో మీటింగ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారు. అమిత్ షాతో పాటు కేంద్రం పెద్దల్ని చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు ఢీల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు తిరిగి రేపు మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలో ఒకసారి ప్రధాని మోదీని కలిసిన చంద్రబాబు.. జీ-20 సన్నాహక సదస్సుకు హాజరైనప్పుడు మరోసారి కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రెగ్యులర్‌గా తమను కలుస్తూ ఉండమని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు.. ఇవాళ అమిత్ షాను, ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం ఉంది.

Read MoreRead Less
Next Story