షణ్ముఖ్ జస్వంత్‌కి ఏమైంది.. హౌస్‌‌లో అలా..

షణ్ముఖ్ జస్వంత్‌కి ఏమైంది.. హౌస్‌‌లో అలా..
యూట్యూబర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్నషణ్ణు ఇపుడు బుల్లితెరపై బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టాడు.

యూట్యూబ్ వీడియోస్ తో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు షణ్ముఖ్ జస్వంత్. ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌'వెబ్‌సిరీస్‌తో 80 మిలియన్స్‌ పైగా వ్యూస్‌ తో యూట్యూబ్ ట్రేండింగ్ గా నిలిచాడు షణ్ణు. యూట్యూబర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్నషణ్ణు ఇపుడు బుల్లితెరపై బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టాడు.

మొదట్లో డాన్స్ వీడియోలు చేసి హల్ చల్ చేసిన షణ్ముఖ్ ఆ తరువాత కామెడీ వీడియోస్‌తోనూ సోషల్ మీడియాలో హవా చేశాడు. యూట్యూబ్ సెన్సేషన్‌గా ఎదిగిన షణ్ముఖ్ పదో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే రిజర్వ్డ్‌డ్‌గా ఉంటూ కాస్త బిడియంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.

వెబ్‌సిరీస్‌‌లో కనిపించే ఉత్సాహం.. హౌస్‌లోకి వచ్చాక ఆవిరి అయిపోయినట్లు భావిస్తున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే తాజాగా షణ్ముఖ్ రెమ్యునరేషన్ విషయం పట్ల కూడా అసంతృప్తిగా ఉన్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది.. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే షణ్ముఖ్‌కే ఎక్కువ ఇస్తున్నారని సమాచారం. వారానికి రూ. 2 నుంచి 2.5లక్షలు వరకు బిగ్‌బాస్ యాజమాన్యం ఇచ్చేటట్లు షణ్ముఖ్‌‌తో ఒప్పందుం కుదుర్చుకుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story