లెజెండరీ థియేటర్ యాక్టర్ జలబాల వైద్య కన్నుమూశారు

లెజెండరీ థియేటర్ యాక్టర్, ఐకానిక్ అక్షర థియేటర్ సహ వ్యవస్థాపకురాలు జలబాల వైద్య (86) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న వైద్య ఆదివారం మరణించారని ఆమె కుమార్తె తెలిపారు. భారతీయ రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు సురేష్ వైద్య, ఆంగ్ల శాస్త్రీయ గాయకుడు మాడ్జ్ ఫ్రాంకీస్ దంపతులకు లండన్‌లో జన్మించారు జలబాల వైద్య. జర్నలిస్ట్‌గా ఆవిడ తన కెరీర్ ను ప్రారంభించారు. ఢిల్లీలోని వివిధ జాతీయ వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లకు పని చేశారు. సంగీత నాటక అకాడమీకి చెందిన ఠాగూర్ అవార్డును, ఢిల్లీ నాట్య సంఘ్ అవార్డును, ఆంధ్రప్రదేశ్ నాట్య అకాడమీ గౌరవంతో పాటు USAలోని బాల్టిమోర్ నగరం యొక్క గౌరవ పౌరసత్వాన్ని అందుకున్నారు. కళలపై ఆవిడ చేసిన కృషికిగాను వారిష్ట్ సమ్మాన్‌తో ప్రభుత్వం గౌరవించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com