పవిత్ర లోకేష్, నరేష్ ల 'మళ్లీ పెళ్లి' టీజర్ రిలీజ్

పవిత్ర లోకేష్, నరేష్ ల మళ్లీ పెళ్లి టీజర్ రిలీజ్
పవిత్ర లోకేష్, నరేష్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ సినిమా టీజర్ ను శుక్రవారం రిలీజ్ చేశారు. వారి నిజజీవితం ఆదారంగానే ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు నరేష్. చాలా కాలంగా పవిత్ర లోకేష్, నరేష్ ప్రేమలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఆ విషయాన్ని నరేష్ కూడా దృవీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వారి జీవితాన్నే సినిమాగా తీసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

టీజర్ లో నరేష్, పవిత్రలకు ఆయన మూడవ భార్యతో హోటల్ లో జరిగిన గొడవను స్పెషల్ అప్పియరెన్స్ గా టీజర్ లో చూయించారు. ఈ సినిమాకు ఎమ్ ఎస్ రాజు దర్శకత్వం వహించగా, సురేష్ బొబ్బిలి & అరుల్ దేవ్ సంగీతాన్ని అందించారు. జయసుధ, శరత్ బాబు, అనన్య నాగళ్ల ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకతను జోడించారు నరేష్. ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 'మళ్లీ పెళ్లి' సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.


https://www.youtube.com/watch?v=eeMQaRzATDQ

Tags

Read MoreRead Less
Next Story