నటి వనిత మూడవ భర్త మృతి

తమిళ నటి వనితా విజయ్‌కుమార్ మాజీ భర్త, విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ పీటర్ పాల్ ఏప్రిల్ 29న చెన్నైలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. గుండెపోటుతో కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్యం విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. వనిత, పీటర్ పాల్ రెండు సంవత్సరాల క్రితమే విడిపోయారు. వనిత తన మాజీ భర్తకు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా నివాళులర్పించింది.
“మా అమ్మ ఒకప్పుడు నాకు ఓ విషయం చెప్పింది, దేవుడు, తమకు తాము సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తాడు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం. మీరు జీవించినంత కాలం రాక్షసులను ఎదుర్కొన్నారు. మీరు అనుభవించిన బాధలు వర్ణనాతీతం. మీకు శాంతి కలుగాలి. ప్రపంచం నుంచి మీరు విడిపోయినందుకు నేను ఎంతో బాధ పడుతున్నాను, మీరు ఎక్కడఉన్నా ఖచ్చితంగా మంచి స్థానంలో ఉంటారని నాకు తెలుసు"అని ట్వీట్ చేశారు. అయితే వనితకు పాల్ మూడవ భర్త, వీరు 2020లో పెళ్లి చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com