10 సీన్లను తొలగించిన సెన్సార్ బోర్డు... 'The Kerala Story' మే 5న విడుదల

10 సీన్లను తొలగించిన సెన్సార్ బోర్డు... The Kerala Story మే 5న విడుదల

'ద కేరళ స్టోరీ' అనే సినిమా ఎట్టకేలకు విడుదల కానుంది. మే 5న విడుదల కానున్న ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'A' సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమా నుంచి 10 సన్నివేశాలను తొలగించింది. కేరళ నుంచి 32 వేల మంది యువతులను నమ్మించి పెళ్లిచేసుకుని మతం మార్చి తీవ్రవాదులుగా మార్చారన్న కథనంతో ఈ సినిమా తెరకెక్కినట్లు చిత్ర యునిట్ తెలిపింది. దర్శకుడు సుదీప్తో సేన్ మాట్లాడుతూ.. నిజ జీవితాల ఆధారంగానే సినిమాను తెరకెక్కించినట్లు చెప్పారు.


సినిమాలో సెన్సార్ బోర్డ్ తీసివేసిన 10 సీన్లలో ఒకటి... కేరళ మాజీ ముఖ్యమంత్రికి చెందిన సీన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరో సన్నివేశంలో హిందూ దేవుళ్లందరిపై అనుచితమైన వ్యాఖ్యలు ఉన్నట్లు సమాచారం. భారత కమ్యూనిస్టులు అతిపెద్ద కపటవాదులు అని చెప్పబడిన డైలాగ్ ను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. కేరళ మాజీ సీఎంతో ఒక టీవీ ఇంటర్వ్యూ జరుగుతున్న సీన్ లో.. అక్కడ యువకులు ఇస్లాం మతంలోకి మారడానికి ప్రభావితమవుతున్నందున రాబోయే రెండు దశాబ్దాలలో కేరళ ముస్లింలు మెజారిటీ రాష్ట్రంగా మారుతుందని సీఎం చెప్పిన సీన్ తొలగించాలని సీబీఎఫ్‌సీ ఆదేశించింది.

కేరళలో 32వేల మంది యువతులను నమ్మించి మతం మార్చి పెళ్లిచేసుకుని చివరికి విడాకులు ఇచ్చి వారిని తీవ్రవాదులుగా మార్చారన్న నిజజీవిత కథనం ఆదారంగా సినిమా తీసినట్లు చిత్రయునిట్ తెలిపింది. ఆ సినిమాను విడుదల కాకుండా ఆపాలని కేరళ రాజకీయనాయకులు, కాంగ్రెస్, కమ్యునిస్ట్ పార్టీలతోపాటు కేరళ ప్రభుత్వం కూడా కోరుతోంది. ఇప్పటికే కేరళ సీఎం పినరై విజయన్ ఈ సినిమాపై తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘ్ పరివార్ చేస్తున్న కుట్రగా అభివర్ణించారు.


Tags

Read MoreRead Less
Next Story