Allari Naresh : రేపే 'ఉగ్రం' రిలీజ్

Allari Naresh : రేపే ఉగ్రం రిలీజ్
X

అల్లరి నరేష్ హీరో గా తెరకెక్కిన 'ఉగ్రం' సినిమా మే 5న రిలీజ్ అవనుంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ బేస్డ్ గా రూపొందింది. సాహు గారపాటి - హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సినిమాలో నరేష్ తో మిర్నా మీనన్ జతకట్టారు. గతంలో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నరేష్ ఇప్పుడు యాక్షన్ సినిమాలకు కేరాఫ్ గా మారారు. గమ్యం సినిమాతో తన సత్తాచాటిన అల్లరి నరేష్ ఇప్పుడు ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఈ సినిమా దర్శకుడు కనకమేడల మాట్లాడుతూ సినిమాను 73రోజుల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. ఇందులో 50 రోజులు రాత్రుల్లోనే షూట్ చేశామని అన్నారు. నాంది సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడలతో రెండో సారి పనిచేసినందుకు సంతోషంగా ఉందన్నారు నరేష్. ఈ సినిమాకు ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయని తెలిపారు.

Tags

Next Story