Kashmir Files : మమతా బెనర్జీకి 'కాశ్మీరీ ఫైల్స్' దర్శకుడి లీగల్ నోటీసులు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి లీగల్ నోటీసులు పంపారు. మమతా బెనర్జీ ఇటీవల చేసిన ప్రకటనలలో.. 'ది కాశ్మీర్ ఫైల్స్' , 'ది కేరళ స్టోరీ' వంటి సినిమాలు సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని కించపరిచేలా తీయబడ్డాయని ఆరోపించారు. ఇందుకుగాను నోటీసులు పంపినట్లు తెలిపారు. “నేను @AbhishekOfficl, పల్లవి జోషి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతకు లీగల్ నోటీసు పంపాము, మమ్మల్ని & మా సినిమాలను పరువు తీసే ఉద్దేశ్యంతో ఆమె తప్పుడు ఆరోపణలు చేశారు. అవి మా పరువును నష్టం కలిగించేవిగా ఉన్నాయి." అని తెలిపారు.
కాశ్మీర్ ఫైళ్లపై మమత
కోల్‌కతా సెక్రటేరియట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన బెనర్జీ .. “‘కాశ్మీర్ ఫైల్స్’ అంటే ఏమిటి? ఇది ఒక వర్గాన్ని కించపరచడమే. 'ది కేరళ స్టోరీ' ఏంటి?... ఇది వక్రీకరించిన కథ. కేరళ స్టోరీని బీజేపీ మార్గదర్శకాలతో తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితం, బీజేపీ నిధులు సమకూర్చిన కొంతమంది తారలు బెంగాల్‌కు వచ్చారు. కొన్ని వక్రీకరించిన, కల్పిత కథతో, 'బెంగాల్ ఫైల్స్' అనే సినిమాను తెరకెక్కించడానికి రెడీ అయ్యారు." అని మమత అన్నారు.
కాశ్మీర్ ఫైల్స్ 2022లో విడుదలైంది. దీనికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 90వ దశకంలో కాశ్మీరీ పండిట్ల వలసల కథతో తీర్చిదిద్దినట్లు ఆయన చెప్పారు. మరోవైపు కేరళ స్టోరీ ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో నిషేధాన్ని ఎదుర్కొంటోంది. కేరళ నుంచి ఇస్లాం మతంలోకి మారిన యువతులను ఇరాక్, సిరియా యొక్క ఇస్లామిక్ స్టేట్‌లో చేర్చిన కథతో తెరకెక్కించినట్లు చిత్ర యునిట్ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com