'పుష్ప'లో ఆ పాత్ర నాకు వచ్చుంటే.. : ఐశ్వర్యా రాజేష్
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప అల్లుఅర్జున్ కు బ్లాక్ బస్టర్ ని అందించింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది. సినిమాలోని పాటలు, డైలాగులు అనుకరిస్తూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇటీవల ఈ సినిమా గురించి నటి ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో అవకాశం వచ్చి ఉంటే తప్పకుండా నటించేదాన్ని అని చెప్పారు. ఇందులో ఓ రోల్ తనకు బాగా సరిపోతుందని అన్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే తనకు చాలా అభిమానమని తెలిపింది. తెలుగులో సినిమా చేస్తే నా కుటుంబం గర్వపడేలా ఉండాలనుకునేదాన్ని.. ఎన్నో ఏళ్లు ఎదురుచూశాక వరల్డ్ ఫేమస్ లవర్ లో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత టక్ జగదీశ్, రిపబ్లిక్ లో నటించాను. ఇప్పుడు కూడా వస్తున్నాయి. కాకపోతే మంచి పాత్రలు వస్తే ఓకే చేస్తాను. ఒకవేళ పుష్పలో రష్మిక చేసిన పాత్ర నాకు వచ్చి వుంటే తప్పకుండా చేసేదాన్ని.. రష్మిక బాగా నటించారు. కాకపోతే ఆ రోల్ నాకు బాగా సెట్ అవుతుందని నానమ్మకం. ప్రేక్షకులను అలరించే విధంగా ఉండే ఏ పాత్ర వచ్చినా చేస్తాను అన ఐశ్వర్య వివరించారు.
సినిమా చిన్నదైనా, పెద్దదైనా తెలుగు ప్రేక్షకులు ఆదరించే తీరు వేరుగా ఉంటుంది. బావుందని అంటే చాలు బ్లాక్ బస్టర్ చేసేస్తారు.. ఇలాంటి ప్రేమ మరే పరిశ్రమలో కనిపించదు అని అన్నారు. ఐశ్వర్య నటించిన డ్రైవర్ జమున ఆహా వేదికగా తెలుగులో విడుదలై తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com