Tollywood: తెలుగు సీనియర్ నటులు శరత్ బాబు కన్నుమూత

తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నటులు, హీరో శరత్ బాబు తుది శ్వాస విడిచారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఎఐజీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ( మే 22న ) మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఊపిరి తిత్తులు, కాలేయం, కిడ్నీలు పాడవడంతో అనారోగ్యం పాలైనట్లు డాక్టర్లు తెలిపారు.
గత కొన్ని రోజులుగా చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకున్న ఆయన వైద్యుల సూచనలతో హైదరాబాద్ లోని ఎఐజీ హాస్పిటల్ కు మారారు. కొన్నిరోజుల క్రితం ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్సను అందించారు. నెల రోజులుగా అయను వెంటిలేటర్ పై ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు. అయినా ఆయన కోలుకోలేదని అన్నారు. శరత్ బాబు మృతిపట్ల సినీ ఇండస్ట్రీ దిగ్బాంతి వ్యక్తం చేసింది. సెలబ్రిటీలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. మృతదేహాన్ని చెన్నైలోని స్వగృహానికి తరలించనున్నట్లు తెలుస్తోంది.
Live Updates
- 22 May 2023 6:10 PM IST
శరత్ బాబు భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఈరోజు సాయంత్రం 5.30pm నుంచి 7.30pm వరకు మా అసోసియేషన్ (తెలుగు ఫిలిం చాంబర్) నందు ఉంచుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రేపు చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com