మీనా నటిగా 40 ఏళ్ల వేడుక.. కంట తడిపెట్టించిన నైనిక

మీనా నటిగా 40 ఏళ్ల వేడుక.. కంట తడిపెట్టించిన నైనిక
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన పేర్లలో నటి మీనా ఒకరు. బాలనటిగా అరంగేట్రం చేసిన మీనా, తర్వాత 1980-90లలో అగ్ర నటిగా వెలుగొందింది.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన పేర్లలో నటి మీనా ఒకరు. బాలనటిగా అరంగేట్రం చేసిన మీనా, తర్వాత 1980-90లలో అగ్ర నటిగా వెలుగొందింది. ఆమె రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, మమ్ముట్టి, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, సురేష్ గోపి మొదలైన దిగ్గజ నటుల సరసన నటించింది. మీనా నటి మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్లే బ్యాక్ సింగర్ కూడా. ఆమె గ్లామరస్, హోమ్లీ పాత్రలు రెండింటినీ చేసి ఆ పాత్రలకు జీవం పోసింది. ఇటీవల మీనా తన భర్తను కోల్పోయింది. ఆ విషాదాన్ని భరిస్తూనే, నటిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో కొన్ని మీడియా తన పర్సనల్ లైఫ్‌లోకి ఇంటర్‌ఫియర్ అవుతూ ఏవేవో రాస్తున్నాయి. దీంతో మీనా చాలా నొచ్చుకునేది, తనపై వస్తున్న వార్తలకు క్రుంగిపోయేది.

ఈ క్రమంలో మీనా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఒక వేడుకను నిర్వహించారు. రజనీకాంత్, రాధిక శరత్‌కుమార్, రోజా సెల్వమణి, ఖుష్బూ, స్నేహ, శ్రీదేవి, ప్రభుదేవా, బోనీకపూర్, సంఘవి , మరికొందరు నటీనటులు ఈ వేడుకలో పాలు పంచుకున్నారు.

మీనా కుమార్తె నైనిక కూడా నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ఐదేళ్ల వయసులో 'తేరి'లో తలపతి విజయ్‌తో కలిసి నటించింది. ఈ చిత్రంలో తన క్యూట్ లుక్స్, పెర్ఫార్మెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, నైనిక తన తల్లి 40వ సంవత్సరాల సినిమా ఈవెంట్‌లో మాట్లాడినప్పుడు కోలీవుడ్ సెలబ్రిటీలు కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో నైనిక.. అమ్మా.. నువ్వు తల్లిగా, నటిగా రెండు పాత్రలు పోషిస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. మీరు నన్ను బాగా చూసుకుంటారు. నాకు ఓ విషయం బాగా గుర్తుంది. నువ్వు, నేను, నాన్న కలిసి షాపింగ్ మాల్‌కి వెళ్లినప్పుడు అక్కడ నేను తప్పిపోయాను. అప్పుడు నాకోసం వెతుకుతూ మీరు చాలా కంగారు పడ్డారు. నువ్వు నామీద కోప్పడ్డావు కూడా. నాన్న చనిపోయాక చాలా డిప్రెషన్‌లో ఉన్నావు.. మానసికంగా బాధపడ్డావు.. ఆ సమయంలో నీ గురించి వస్తున్న వార్తలు చూసి చాలా బాధపడ్డావు. మా అమ్మ కూడా మీలాంటి మనిషే. ఆమె బాధపడుతుంది. కాబట్టి ఇలాంటి వార్తలు రాయడం దయచేసి మానేయండి అని అనడంతో వేడుకకు హాజరైన వారికళ్లు చెమ్మగిల్లాయి. వేదిక మీద ఉన్న నైనికను రజనీకాంత్ హగ్ చేసుకుని నుదుటన ముద్దు పెట్టుకున్నారు. మీకు మేమంతా ఉన్నాం అని భరోసా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story