తిరిగి రాని లోకాలకు నందమూరి తారకరత్న

తిరిగి రాని లోకాలకు నందమూరి తారకరత్న
X

నటుడు నందమూరి తారకరత్న తుదిశ్వాస విడిచారు. 23రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ఆయన పార్థీవ దేహాన్ని హైదరాబాద్ లోని స్వగృహానికి తరలించారు. తారకరత్న మృతిపట్ల ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, సీఎం జగన్ తో పాటు రాజకీయ ప్రముఖులు, సీనీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

కుప్పం రోడ్ షోల్ పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు సంభవించి అక్కడికక్కడే కుప్పకూలారు. ఆయన్ను కుప్పంనుంచి బెంగళేరుకు తరలించి 23రోజుల పాటు వైద్యం అందించారు. గుండెపోటు వచ్చిన తర్వాత ఆయన కోమాలోకి వెళ్లారు. డాక్టర్లు ప్రపచంలోని మెరుగైన వైద్యాన్ని అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేవు. అభిమానుల సందర్శనార్థం పార్థీవదేహాన్ని ఫిల్మ్ చాంబర్ కు తరలించనున్నారు. రేపు మహా ప్రస్థానంలో ఆయన దహన సంస్కారాలు జరుగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Tags

Next Story