Kollywood : నటుడు ప్రభుకు అస్వస్థత

కోలీవుడ్ వెటరన్ యాక్టర్ శివాజీ గణేషన్ కుమారుడు, ప్రముఖ నటుడు ప్రభు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభు కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా ఆయన కిడ్నీలోని రాళ్లను తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని, మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయం తెలిసి ప్రభు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఆయన చివరగా దళపతి విజయ్ వారిసు చిత్రంలో నటించారు.
నటుడు ప్రభు సినీ కెరీర్ విషయానికొస్తే.. 1982లో సంగిలి చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాల్లో హీరోగా నటించిన ఆయన.. మణిరత్నం అంజలిసినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ప్రభు ఇప్పటికే 200కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో రజినీకాంత్ చంద్రముఖి సినిమాతో పాటు ప్రభాస్ నటించిన డార్లింగ్ చిత్రంలో ఆయనకు మంచి పేరొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com