Naga Chaitanya : నాగ చైతన్యకు 100 కోట్ల ఛాన్స్

Naga Chaitanya :  నాగ చైతన్యకు 100 కోట్ల ఛాన్స్
X

అక్కినేని నాగ చైతన్య.. ఆ మధ్య వరుస విజయాలతో ఫామ్ లోకి వచ్చినట్టే కనిపించాడు. కట్ చేస్తే మళ్లీ హ్యాట్రిక్ ఫ్లాపుల పడ్డాయి. కస్టడీ, థ్యాంక్స్ చిత్రాలు బాగా నిరుత్సాహ పరిచాయి. దీంతో ఓ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలోనే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తండేల్ మూవీ కోసం రెండేళ్లుగా కష్టపడుతున్నాడు. తండేల్ పై చైతన్య చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అతనితో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసులు కూడా అంతే నమ్మకంతో ఉన్నారు. ఇక తనుంటే హిట్ అనే ట్యాగ్ తెచ్చుకున్న సాయి పల్లవి హీరోయిన్ కావడం.. ఆల్రెడీ చైతూ, సాయి పల్లవి కాంబోలో లవ్ స్టోరీ హిట్ అయి ఉండటంతో కాంబినేషన్ క్రేజ్ కూడా యాడ్ అయింది. దీనికి తోడు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో వచ్చిన మూడు పాటలూ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాయి. ఒకదాన్ని మించి ఒకటి హిట్ అనేలా ఉన్నాయీ సాంగ్స్. ఇన్ని ప్లస్ పాయింట్స్ కు తోడు అసలైన ప్లస్ పాయింట్ తండేల్ రిలీజ్ డేట్.

ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది తండేల్. ఆ రోజు అతనికి పోటీ లేదు. ముందు రోజు అజిత్, త్రిషల పట్టుదల మూవీ ఉంది. కానీ అది చైతన్యకు పోటీ ఇస్తుందనుకోలేం. కేవలం తమిళ్ లో మాత్రమే తండేల్ కు సమస్య ఉంటుంది. తెలుగు నుంచి మీడియం రేంజ్ మూవీస్ కూడా లైన్ లో లేవు. చిన్న సినిమాలున్నా.. ఓపెనింగ్స్ తెచ్చుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే ఈ మూవీ షూటింగ్ టైమ్ లోనే నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాతో నాగ చైతన్య 100 కోట్ల క్లబ్ లో ఎంటర్ అవుతాడు అన్నాడు. తండేల్ మూవీ కంటెంట్ ఏ మాత్రం ఆకట్టుకున్నా ఇన్ని ప్లస్ పాయింట్స్ తో ఆ మార్క్ ను టచ్ చేయడం ఏమంత కష్టం కాదు. పైగా ఈ మూవీలో దేశభక్తిని కూడా రంగరించారు. అఫ్ కోర్స్ ఇదంతా నిజంగా జరిగిన కథే అని అందరికీ తెలుసు.

కొన్నేళ్ల క్రితం శ్రీకాకుళం జాలరులు కొందరు పొరబాటున పాక్ సముద్ర జలాల్లోకి వెళ్లారు. వీరిని ఇండియన్ ఏజెంట్స్ అని భావించిన పాక్ వారిని బంధించి జైల్లో పెట్టి చిత్ర హింసలు పెట్టింది. విషయం తెలిసిన భారత ప్రభుత్వం స్పందించి అతి కష్టంగా అందరినీ విడిపించింది. ఆ కథనే కాస్త లవ్ స్టోరీ మిక్స్ చేసి ఎమోషనల్, పేట్రియాటిక్ మూవీగా రూపొందిస్తున్నాడు దర్శకుడు చందు మొండేటి. మొత్తంగా నాగ చైతన్యకు 100 కొల్లగొట్టేందుకు చాలా అవకాశాలున్నాయి. కాకపోతే కథ, కథనం బలంగా ఉంటేనే ఆ ఫీట్ సాధించగలడు. లేదంటే ఇన్ని అవకాశాలు కూడా నిరుపయోగం అయిపోతాయి.

Tags

Next Story