'ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్' మే12న రిలీజ్

ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ మే12న రిలీజ్

'ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్' సినిమా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. మంత్ర సినిమాను తెరకెక్కించిన జెన్ నెక్ట్స్ మూవీస్ ఈ సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నారు. ఇదే బ్యానెర్ లో మళయాల గ్లామరస్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై చిత్రాన్ని తెరకెక్కింది. ఈ సినిమా అనుపమకు కెరియర్ లో బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. అలాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానెర్ పై, మంత్ర సినిమా రచయిత రవి ప్రకాశ్ బోడపాటి డెబ్యూ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్.. ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్.

ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ సంస్థ ద్వారా విడుదలకు సిద్దం అయింది. ఇప్పటికే విడుదలచేసిన ఈ మూవీ టీజర్ ఆద్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్, యాక్షన్ తో పాటు, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ మర్డర్ కేసును సాల్వ్ చేసే ప్రాసెస్ లో అన్ని కోణాల్లో జర్నలిస్టులు, పోలీసులు ఇన్వెస్ట్ గేషన్ చేసే నేపథ్యంలో ఈ కథ సాగుతున్నట్లు తెలుస్తుంది.

రవి ప్రకాష్ బోడపాటి రచన-దర్శకత్వంలో, ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపులు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రంలో నిహాల్ కోదాటి హీరోగా, దృషికా చందర్ హీరోయిన్ లతో పాటు సినయర్ నటుడు మధునందన్, భార్గవ పోలుదాసు, భావన దుర్గం, సమర్థ యుగ్ అలాగే ప్రముఖ జర్నలిస్ట్ దేవి నాగావల్లీ, మెహెర్ శ్రీరామ్ తదితరులు నటించారు.


నటీ నటులు:

నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ తదితరులు

సాంకేతిక నిపుణులు:

స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : రవి ప్రకాష్ బోడపాటి

నిర్మాతలు : ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు

సహ నిర్మాతలు : అనిల్, క్రాంతి జువ్వల

ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్ : మోహన్ దాస్ సాదునూరు

డి. ఓ. పి : అమర్ దీప్

ఎక్సగ్యూషన్ లీడ్ : పాంచజన్య పోతరాజు

క్రియేటివ్ హెడ్ : కృష్ణ చైతన్య పసుపులేటి

ఆర్ట్ : విజయ్ మక్కెన

సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ : అర్వీజ్

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ : గిడియన్ కట్ట

ఎడిటర్ : ప్రవీణ్ పూడి

కాస్ట్యూమ్స్ డిజైనర్: హర్షిత రావూరి

ప్రొడక్షన్ హెడ్ : అరవింద్ కుమార్ పిట్టల

డబ్బింగ్ & డి ఐ : జయంతి స్టూడియో

సౌండ్ ఎఫెక్ట్స్ : నాగ కిరణ్

వి ఎఫెక్ట్స్ : ప్రైమ్ పిక్సెల్

డాల్బీ మిక్సింగ్ : ప్రసాద్ ల్యాబ్ అట్మాస్ స్టూడియో

Tags

Read MoreRead Less
Next Story