Karnataka: 12 ఏళ్ల బాలుడికి గుండెపోటు.. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే..

Karnataka: ముదిమి వయసు వారికే రోగాలు, మరణాలు అనుకునే రోజులు పోయాయి..
వయసుతో పనిలేకుండా వస్తున్న జబ్బులు ఉన్నఫళంగా ప్రాణాలు తీస్తున్నాయి.
ముదిమి వయసు వారికే రోగాలు, మరణాలు అనుకునే రోజులు పోయాయి.. వయసుతో పనిలేకుండా వస్తున్న జబ్బులు ఉన్నఫళంగా ప్రాణాలు తీస్తున్నాయి.అప్పటి వరకు స్నేహితులతో ఆడుకొని వచ్చిన 12 ఏళ్ల పిల్లవాడు గుండె పట్టుకుని కుప్పకూలిపోయాడు.. అమ్మానాన్న ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే కన్నుమూశాడు.
ఈ విషాద సంఘటన కర్ణాటక రాష్ట్రం మడికేరి జిల్లా కూడుమంగళూరులో చోటు చేసుకుంది. కీర్తన్ కొప్ప భారత మాత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. తండ్రం మంజారి అదే స్కూల్లో బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
శనివారం సాయింత్రం ఆడుకుని వచ్చిన కీర్తన్ గుండె నొప్పిగా ఉందని చెప్పి స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబసభ్యులు బాలుడిని కుశాలా నగర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించాడని అతడి మరణానికి గుండెపోటు కారణమని వైద్యులు వివరించారు.
ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. ఇంత చిన్న వయసులో గుండెనొప్పి ఏవిటో అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com