Bhola Shankar: 126 అడుగుల భారీ కటౌట్... టాలీవుడ్ లోనే ఫస్ట్ టైమ్

Bhola Shankar: 126 అడుగుల భారీ కటౌట్... టాలీవుడ్ లోనే ఫస్ట్ టైమ్
X
'భోళా శంకర్' రిలీజ్ కు గట్టిగానే ఏర్పాట్లు.. చిరు అతి పెద్ద కటౌట్ తో భారీ ప్రమోషన్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా ఆగస్టు 11 న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన చిత్రంలో కాజల్ అగర్వాల్ చిరుకు జోడీగా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చెల్లెలిగా నటిస్తోంది. అయితే మెగాస్టార్ మూవీ త్వరలోనే విడుదల కానుండడంతో మెగా ఫ్యాన్స్ ఇప్పట్నుంచే సంబరాలు మొదలుపెట్టారు. మామూలుగా మూవీ రిలీజ్ అవుతుందంటే రెండు, మూడు రోజుల ముందు నుంచి హీరోల కటౌట్స్, బ్యానర్లు కట్టడం చూస్తుంటాం. అదే చిరు మూవీ విడుదలవుతుందంటే అంతకు మించి ఉండాలని ఆయన మేకర్స్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటివరకు ఎప్పుడూ ఏర్పాటు చేయనంత పెద్ద చిరు కటౌట్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

సాధారణంగా థియేటర్లలో సినిమాల కటౌట్‌లు వేస్తారు. అయితే, మేకర్స్ మాత్రం ఈ సారి హైవే లొకేషన్‌ను ఎంచుకున్నారు. ఎందుకంటే రోడ్డు మార్గంలో వెళ్లే ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే దీన్ని విజయవాడ, హైదరాబాద్ హైవేపై ఉన్న సూర్యాపేటలోని రాజు గారి తోట రెస్టారెంట్‌ సమీపంలో ఏర్పాటు చేశారు. దాదాపు 126 అడుగుల ఈ భారీ కటౌట్‌ ఇప్పుడు ఆ ఏరియాలోనే కాదు దేశ వ్యాప్తంగానూ పాపులర్ అయింది. మరో చెప్పుకోదగిన విషయమేమిటంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంతకుమునుపెన్నడు ఇంత పెద్ద కటౌట్ ను ఏర్పాటు చేయకపోవడం. దీంతో తమ అభిమాన నటుడి పెద్ద కటౌట్‌ను చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ భారీ కటౌట్ లో చిరంజీవి బ్లాక్ టీ షర్ట్, దానిపై వైట్ గీతలతో ఉన్న చొక్కా ధరించి, బ్లాక్ పాయింట్, గాగుళ్స్, చేతికి వాచ్, కాళ్లకు షూ ధరించి చేతిలో కీ చెయిన్ తో స్టైల్ కనిపిస్తున్నారు. దాంతో పాటు కటౌట్ పై భాగంలో హయ్యెస్ట్ ఎవర్ కటౌట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని పెద్ద అక్షరాలను రాశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. విడుదలకు ముందే చిరు హవా ఈ స్థాయిలో ఉంటే.. ఇక విడుదల రోజు ఎలా ఉంటుందోనని మెగా అభిమానులు ఇప్పట్నుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు.

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'భోళా శంకర్' సినిమాలో చిరంజీవి పాతకాలపు మాస్, యాక్షన్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో వినోదంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండనున్నట్టు సమాచారం.


Tags

Next Story