Emergency : ఎమర్జెన్సీలో 13 చేంజెస్!

Emergency : ఎమర్జెన్సీలో 13 చేంజెస్!

కంగనా నటించిన ఎమర్జెన్సీ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. కానీ సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న 13 సీన్లను కట్ చేయాలని రివైజింగ్ కమిటీ సూచించింది. అందుకు మూవీ టీమ్, కంగనా రనౌత్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే సెన్సార్ బోర్డు ప్రతిపాదించిన మార్పులకు ఎమర్జెన్సీ మూవీ నిర్మాతలు అంగీకారం తెలిపారని జీ స్టూడియోస్ తరపు న్యాయవాది ముంబై హైకోర్టులో ఇవాళ వెల్లడించారు. అయితే సెన్సార్ బోర్డు సూచన ప్రకారం నిర్మాతలు ఓ ఫార్మట్ ను అందజేశారని దానిపై బోర్డు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. దీంతో వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 3 కు వాయిదా వేసింది. అయితే ఎమర్జెన్సీ మూవీని గతనెలలోనే విడుదల చేయాల్సి ఉండగా.. సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ లో ఇబ్బందులు కారణంగా సినిమా విడుదల నిలిచిపోయింది. అయితే ఎమర్జెన్సీ సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కంగనా.. మూవీ విడుదల ఆలస్యం కావడంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందులో భాగంగానే ఎమర్జెన్సీ ముంబై బాంద్రాలోని తన బంగ్లాను అమ్ముకోవల్సి వచ్చింది. సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను కంగానా పోషించింది.

Tags

Next Story