ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును.. ట్రక్కు ఢీకొనడంతో 18 మంది దుర్మరణం పాలయ్యారు.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును.. ట్రక్కు ఢీకొనడంతో 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లక్నోకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారాబంకీ జిల్లా రాంస్నేహిఘాట్‌ వద్ద జరిగింది. హర్యానా నుంచి కూలీలతో బీహార్‌ వెళ్తున్న బస్సు.. రాత్రి అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో మరమ్మతులు చేస్తుండటంతో కూలీలు కిందకు దిగి దాని ముందు నిద్రపోయారు. తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు బస్సును ఢీకొట్టింది. రోడ్డుపై నిద్రిస్తున్న కూలీలపైకి దూసుకెళ్లింది. దీంతో స్పాట్‌లోనే 18 మంది చనిపోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Tags

Next Story