18 pages twitter review: రొమాంటిక్ కామెడీ.. '18 పేజెస్' ఎంజాయ్ చేయొచ్చు

18 pages twitter review: రొమాంటిక్ కామెడీ.. 18 పేజెస్ ఎంజాయ్ చేయొచ్చు
X
18 pages twitter review: నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ రొమాంటిక్ డ్రామా 18 పేజెస్. కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించిన నటుడు నిఖిల్ సిద్ధార్థ. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

18 pages twitter review: నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ రొమాంటిక్ డ్రామా 18 పేజెస్. కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించిన నటుడు నిఖిల్ సిద్ధార్థ. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.



నందిని పాత్రలో అనుపమ, సిద్ధు పాత్రలో నిఖిల్ సిద్ధార్థ ఒదిగిపోయారు. ఈ సినిమాలో దినేష్ తేజ్, సరయు, అజయ్, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. మొదటి-రోజు మొదటి షోను చూసిన ప్రేక్షకులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.



అసిస్టెంట్ డైరెక్టర్స్‌ని డెబ్యూకి ప్రోత్సహిస్తున్న దర్శకుడు సుకుమార్. ఈ సినిమా దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్‌. ఈ సినిమా కథ కూడా సుకుమార్‌దే. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై ఆయన సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రావడంతో చిత్ర యూనిట్ అప్పుడే సక్సెస్ అయినట్లు ఫీలయ్యారు. ఇప్పుడు విడుదలైన అన్ని థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంటోంది 18 పేజెస్.

'నన్నయ రాసిన', 'ఏడురంగుల వాన', 'టైం ఇవ్వు పిల్ల' సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు సంగీత ప్రియులను అలరించాయి. ఈ చిత్రానికి వసంత్ సినిమాటోగ్రాఫర్ మరియు నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం, బాణీలు గోపి సుందర్ స్వరాలు సమకుర్చారు. జీఏ 1 పిక్చర్స్ బ్యానర్‌పై సుకుమార్‌తో కలిసి బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.


Tags

Next Story