Manmadhudu : సినిమా వచ్చి 18 ఏళ్ళు అయినా.. ఇంకా పవర్ తగ్గలే!

మన్మధుడు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ ఒక్క టైటిల్ కి పర్ఫెక్ట్ హీరో ఎవరంటే అందరి నుంచి వచ్చే సమాధానం నాగార్జుననే.. నాగ్ కి ఇప్పటికి 60 ఏళ్ళు వచ్చినప్పటికీ మగువల దృష్టిలోమాత్రం ఇప్పటికి నవ యువ మన్మధుడే. ఇదే టైటిల్ తో 18 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి నిజంగానే తానూ మన్మధుడని చూపించారు నాగ్.. ఈ సినిమా వచ్చి నేటికి(డిసెంబర్ 20) 18 ఏళ్ళు పూర్తి అయింది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చిన నాలుగో సినిమానే మన్మధుడు. సంతోషం సినిమా తర్వాత ఓ హిందీ సినిమా కమిట్ అయిన నాగ్... అంతా బిజీ షెడ్యుల్ లో ఈ కథ విని ఒకే చెప్పారు. కథకి ప్లాట్ అయిన నాగ్ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా చేయడానికి ముందుకు వచ్చారు.
ఇక ఆనందం, ఖడ్గం సినిమాలతో యూత్ లో మంచి ఫేం సంపాదించుకున్న సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కి నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఓ స్టార్ హీరోకి మ్యూజిక్ చేయడం దేవి శ్రీ ప్రసాద్ కి ఇదే మొదటిసారి కావడం విశేషం. అప్పటికే మురారీ, ఇంద్ర సినిమాలతో మంచి ఫేం సంపాదించుకున్న సోనాలి బింద్రేని ఫస్ట్ ఛాయస్ లోనే ఒకే చేయగా, చాలా మంది పేర్ల తర్వాత మహేశ్వరి పాత్రకి అన్షును తీసుకున్నారు.
ఆరు పాటల్లో ఐదు పాటలు సిరివెన్నెల సీతరామశాస్త్రి రాయగా, మరో పాటను భువనచంద్ర రాశారు. ఇక ఈ చిత్రంలో నాగ్ వేసిన షార్ట్ కుర్తాలు, మన్మథుడు షర్ట్ లుగా పేరొందాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 13.5 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాని కన్నడలో, బెంగాలీలో రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.
సినిమాలో ఫేమస్ అయిన సంబాషణలు,
01. వాడు వేరు, వాడి ప్రేమ ఒక సముద్రం, వాడి జాలి ఒక వర్షం, వాడి కోపమొక ప్రళయం
02. నాగ్: ముందు మీరావిడని ప్రేమించారా? లేక ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా?
బ్రహ్మీ: ముందు తను నన్ను ప్రేమించింది... తర్వాత నేను తనని ప్రేమించాల్సి వచ్చింది.
03. ట్రాన్స్ ఫార్మర్లకి, అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.
04. ప్రేమించేవాడికి భయం ఉండకూడదు. భయపడేవాడు ప్రేమించకూడదు.. భయపడుతూ ప్రేమించేవాడు బాధపడకూడదు.
05. దేవుడు దుర్మార్గుడు లక్ష్మి.. కళ్ళున్నాయని సంతోషించేలోపే కన్నీళ్లు ఉన్నాయని చూపిస్తాడు.
06. పెళ్ళంటే నూరేళ్ళ పంట కాదు..ఎవ్రీ డే మంట
07. అమ్మాయిలకి ప్రేమించడానికి టైం ఉంటుంది కానీ పెళ్లి చేసుకోవడానికి దైర్యం ఉండదు. ప్రేమించినప్పుడు పెద్దోళ్ళు గుర్తురారు.. పెళ్లి చేసుకునే ముందు ప్రేమించినోడు గుర్తుకురాడు.
08. నాకు నీళ్ళు అంటే భయం .. నాకు మా ఆవిడంటే భయం.. కళ్ళు మూసుకొని సంసారం చేయడం లేదా?
09. నువ్వంటే ఎందుకో ఇష్టమో చెప్పలేను.. కానీ ఎంత ఇష్టమో చెప్పగలను.
10. అమ్మాయిలని ప్రేమిస్తే లిఫ్ట్ లు మనమే ఇవ్వాలి.. గిఫ్ట్ లు మనమే ఇవ్వాలి.. ఫైనల్ గా వాళ్ళు మాత్రం హ్యాండ్ ఇస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com