19 Years For Okkadu: 'ఒక్కడు' సినిమాకు 19 ఏళ్లు.. ఫస్ట్ అనుకున్న ఆ టైటిల్ పెట్టుంటే సినిమా ఫ్లాపయ్యేది!

19 Years For Okkadu (tv5news.in)
19 Years For Okkadu: సినిమా చూస్తున్నంతసేపు అభిమానుల్లో తెలియని ఉత్సాహం.. ప్రతీ సీన్‌కు విజిల్ వేయాలనిపించే ఎలివేషన్స్.. తమ హీరోను ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అలాగే చూపించే సీన్స్.. ఇవన్నీ కలిపితేనే ఓ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఎన్ని సంవత్సరాలైనా.. ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. అలాంటి ఒక సినిమానే మహేశ్ బాబు నటించిన 'ఒక్కడు'. ఈ సినిమా విడుదలయ్యి ఇప్పటికి 19 ఏళ్లు పూర్తిచేసుకుంది.
మహేశ్ బాబు అంటే అప్పటివరకు ఒక లవర్ బాయ్‌గానే చాలామందికి తెలుసు. మధ్యలో 'టక్కరి దొంగ' అంటూ మాస్ యాంగిల్ ట్రై చేసినా.. 'వంశీ', 'బాబీ' లాంటి సినిమాల్లో ఫైట్లు చేసినా.. అవేవి మహేశ్‌లోని మాస్ యాంగిల్‌ను పూర్తిగా ప్రేక్షకులకు పరిచయం చేయలేదు. అలాంటి టైమ్‌లో వచ్చింది 'ఒక్కడు'. మహేశ్ క్లాస్‌తో పాటు మాస్ కూడా చించేయగలడని నిరూపించింది.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కడు చిత్రాన్ని ఎమ్ ఎస్ రాజు నిర్మించాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లోనే గుణశేఖర్‌కు ఛార్మినార్ సెట్‌లో ఒక సినిమా చేయాలన్న కోరిక ఉండేది. అందుకే ఒక్కడు చిత్రం మొత్తం ఓల్డ్ సిటీ సెట్ వేసి మరీ.. తెరకెక్కించాడు గుణశేఖర్. మహేశ్ తన డెబ్యూ సినిమా 'రాజకుమారుడు'కు షూట్ చేస్తున్న సమయంలోనే గుణశేఖర్ తనను చూసి తనే నా సినిమాలో హీరో అని ఫిక్స్ అయిపోయాడట.
ఒక్కడు కథను పక్కాగా రాసుకున్న గుణశేఖర్.. మహేశ్‌కు ఆ కథ చెప్పి ఓకే చేయించాడు. ముందుగా రామోజీ రావు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఛార్మినార్ సెట్ నిర్మించమని కూడా చెప్పారట. కానీ ఎందుకో తెలీదు ఆయన ఉన్నట్టుండి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత ఎమ్ ఎస్ రాజును నిర్మాతగా తీసుకోమని మహేశే రికమెండ్ చేశారట.
ఒక్కడు చిత్రంలో మహేశ్ కబడ్డీ ప్లేయర్‌గా నటించాలి. అందుకే మహేశ్ రెండురోజులు దీక్షగా ప్రాక్టీస్ చేసి బేసిక్స్ కూడా నేర్చుకున్నారని టాక్. ఈ సినిమా హీరోయిన్ భూమికను కూడా మోస్ట్ వాంటెడ్ చేసింది. మహేశ్ నటించిన సినిమాల్లో తన భార్య నమ్రతకు కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ చిత్రం 'ఒక్కడు'నే అని ఇప్పటికీ చాలాసార్లు బయటపెట్టారు. 'అతడే ఆమె సైన్యం' అని ముందుగా ఈ సినిమాకు టైటిల్ అనుకున్నారు. ఇది వేరే సినిమాకు రిజస్టర్ అయ్యేసరికి మూవీ టీమ్ వెనక్కి తప్పుకున్నారు. ఆ తర్వాత 'కబడ్డీ' అనే టైటిల్‌ను సిఫారసు చేసింది మూవీ టీమ్. అది మహేశ్ బాబుకు నచ్చలేదు. చివరికి 'ఒక్కడు'గా వచ్చి సూపర్ హిట్ కొట్టాడు
Celebrating 19 years of Cult Classic #Okkadu ❤️🔥@urstrulymahesh @gunasekhar1 @MSRaju #ManiSharma @bhumikachawlat @prakashraaj @GkParuchuri#19YearsForCultClassicOkkadu pic.twitter.com/SrnR4arD4N
— Gunaa Teamworks (@GunaaTeamworks) January 15, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com