Nuvvu Nenu 20 Years: 'నువ్వు నేను' ఉదయ్ కిరణ్ కోసం కాదు..ఆసక్తికర విషయాలు ఇవే

Nuvvu Nenu 20 Years: నువ్వు నేను ఉదయ్ కిరణ్ కోసం కాదు..ఆసక్తికర విషయాలు ఇవే
తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, అనిత హీరోహీరోయిన్లగా నటించిన చిత్రం నువ్వు నేను

తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, అనిత హీరోహీరోయిన్లగా నటించిన చిత్రం నువ్వు నేను(Nuvvu Nenu). 2001లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకి ఆర్పీ అదించిన సాంగ్స్ఎవర్‎ గ్రీన్‎గా నిలచాయి. ఇండస్ట్రీలోనే ఏ సినిమాకు దక్కని ఘనత ఈ మూవీకే వచ్చింది. ఈ సినిమా ఒకే సినిమాకు ఐదు నంది అవార్డులు, నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు దక్కడం విశేషం. ఈ సినిమాతోనే ఉదయ్ కిరణ్ స్టార్ డం వచ్చింది. ఆ తర్వాత వరుస హిట్స్ కొట్టి అగ్రహీరోగా ఎదిగాడు ఉదయ్. ఈ సినిమా ఆగస్టు 10, 2001వ సంవత్సరంలో రిలీజ్ అయి ఎవరు ఉహించని విజయాన్ని అందుకుంది. నేటికి 20 ఏళ్ళు నిండాయి.. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రవి పాత్రలో ఉదయ్ కిరణ్(Uday kiran) ఒదిగిపోయాడు. వసుంధరగా అనిత నటన ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి ప్రాత్ర ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ శకుంతల చేప్పే డైలాగ్స్ కేక పుట్టించాయి. ఉదయ్ లాస్ట్ లో మీ పెద్దొళ్లున్నారో పిల్లల ప్రేమను అస్సలు అర్థం చేసుకోరు అని చెప్పే డైలాగ్ థియేటర్స్ లో ప్రేక్షకులతో విజిల్స్ వేయించింది.

ఈ సినిమాలో ప్లాట్ విషయానికి వస్తే.. ఒక ధనవంతుల కుటుంబంలోని ఏకైక సంతానం రవి. అతను చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి ఉంటాడు. తండ్రి వ్యాపారంలో తీరికలేకుండా అతన్ని సరిగా పట్టించుకోకుండా ఉంటే ఇంట్లో నమ్మకస్తుడైన రాళ్ళపల్లి అతని బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. వసుంధర పాతబస్తీలోని ఒక పాలవాని కూతురు. ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుతుంటారు. రవి చదువులో వెనుకబడి ఉంటే వసుంధర మాత్రం ఎప్పుడూ ముందజలో ఉంటుంది. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. కానీ పెద్దలు వీరి ప్రేమను ఆమోదించక ఇద్దరినీ వేరు చేస్తారు. చివరికి మిత్రుల సహాయంతో పెద్దలను ఎదిరించి వీరు పెళ్ళి చేసుకుంటారు.

ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు:

*అప్పటివరకూ కెమెరామాన్ గా ఉన్న తేజ చిత్రం సినిమాతో దర్శకుడిగా మారి ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాడు.. దీనితో తేజ చూట్టూ చాలా ఆఫర్స్ ఉన్నాయి.. ఏకంగా వెంకటేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయింది.

*వెంకటేష్ తో అనుకున్న సినిమా క్యాన్సల్ అవ్వడంతో అదే నిర్మాతతో మరో సినిమాకి కమిట్ అయ్యాడు తేజ.. అదే నువ్వు నేను

*ఈ సినిమాకి దశరథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన సహకారం అందించారు.




*చిత్రం సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ కూడా ఖాళీగానే ఉన్నాడు.

*తేజ ఆఫీస్‌కు రోజు వెళ్లి కూర్చునేవాడు ఉదయ్ కిరణ్. మీరు ఇంకో అవకాశం ఇవ్వాలి సార్ అన్నట్టు చూసేవాడు.

*తేజ మనస్సులో మాధవన్ లతో సినిమా చేయాలని అనుకున్నాడు.. కానీ ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ని ఫైనల్ చేశాడు తేజ.



*నువ్వు నేను కథ చెప్పిన తర్వాత కూడా మాధవన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు

*ఉదయ్ కిరణ్‌ను చూసి నువ్వే ఈ సినిమాలో హీరో అనేసాడు తేజ

*వంద మందితో హీరోయిన్స్ కోసం ఆడిషన్స్ పెట్టాడు తేజ.. అందులో ఒక్క అమ్మాయిని హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తే .. ఆ హీరోయిన్ కారు, హోటల్ అంటూ బిల్డప్ ఇచ్చిందట.. దీనితో తేజ మిగిలిన అమ్మాయిలలో ఎవరు చీప్ అని నీకు అనిపిస్తుంది అని అడగగా ఓ అమ్మాయిని చూపించిందట ఆ హీరోయిన్ .. అదే అమ్మాయిని హీరోయిన్ గా ఫైనల్ చేశాడు తేజ.. ఆమె అనిత


*హైదరాబాదు, ముంబై, వికారాబాద్ లో మొత్తం సినిమా షూటింగ్ చేశారు.

*సినిమా మొత్తంలో 11 పాటలు ఉన్నాయి. ఆర్పీ పట్నాయక్ పాటలకి సూపర్ రెస్పాన్స్.. గాజువాక పిల్ల పాట పెద్ద ట్రెండ్ ని క్రియేట్ చేసింది.

*సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసి ఆగస్టు 10, 2001లో రిలీజ్ చేశారు. ఫస్ట్ షో నుంచే సినిమాకి అదిరిపోయే టాక్ వచ్చింది. మొత్తం ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్.. యూత్ మొత్తం ధియేటర్లలోనే..

*సినిమాలో " మీ పెద్దోల్లున్నారే " అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది.

*ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ స్టార్ హీరో అయిపోయాడు.. ఈ సినిమాతో ఉదయ్ ఏకంగా అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.

*ఈ సినిమాతో తేజ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.. ఆర్పీ పట్నాయక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. లిరిక్ రైటర్ కులశేఖర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలంగాణ శకుంతలకి స్టార్ బ్రేక్ ఇచ్చింది నువ్వు నేను..

*దాదాపుగా కోటి యాబై లక్షలతో ఈ సినిమాని తెరకెక్కిస్తే...20 కోట్ల వరకూ సాధించిపెట్టింది ఈ చిత్రం..

*నరసింహనాయుడు, ఖుషి, నువ్వే కావాలి తర్వాత ఒక్క ధియేటర్ లోనే కోటి రూపాయలను వసూళ్ళును సాధించింది ఈ సినిమా..

*మొత్తం 70 కేంద్రాలలో వంద రోజులు ఆడింది.

*ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమాను జెమినీ కిరణ్ నిర్మించాడు.

*ఈ సినిమాకి మొత్తం అయిదు నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో ఐదు నంది పురస్కారాలు దక్కాయి. నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు కూడా దక్కాయి.

*ఈ చిత్రం హిందీలో యే దిల్ (2003), తమిళంలో మదురై వీరన్ (2007) మరియు బెంగాలీలో డుజోన్ (2009) గా రీమేక్ చేయబడింది . హీరోయిన్ అనిత హిందీ వెర్షన్‌లో తన పాత్రను తిరిగి పోషించారు.


Tags

Read MoreRead Less
Next Story