2024: మహిళల వ్యథలే.. సినిమా కథలయ్యాయ్

వెండితెర... వినోదాన్ని పంచేది మాత్రమే కాదు.. ఆలోచనల్ని రేకెత్తించేది.. చైతన్యాన్ని రగిలించేది. ఈ వెండితెరనే వేదికగా చేసుకుని సమాజంలోని సమస్యల నేపథ్యంతో సినిమాలు రూపొందిస్తుంటారు దర్శకులు. ఈ సినిమాల్లో మహిళల వ్యథలు, సమాజంలో వాళ్ల ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన ఇతివృత్తింగా మారుతాయి. మహిళల వ్యథలే కథలైన ఈ సినిమాలు.. ఈ ఏడాది ప్రేక్షకుల్ని కదిలించాయి.. వాళ్ల చేత కన్నీళ్లు పెట్టించాయి. ఆస్కార్ నామినేట్ అయిన లాపతా లేడీస్ నుంచి కేన్స్ చిత్రోత్సవంలో అవార్డు గెలిచిన ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్ వంచి చిత్రాలను కొత్త ఏడాది ఆరంభం వేళ ఒక్కసారి నెమరు వేసుకుందాం!
లాపతా లేడీస్
ఈ ఏడాది ఆస్కార్ కు నామినేట్ అయిన చిత్రం లాపతా లేడీస్. ఈ ఏడాది మార్చి 1న విడుదలైన ఈ సినిమా పితృస్వామ్య వ్యవస్థపై బాలీవుడ్ దర్శకనిర్మాత కిరణ్ రావు సంధించిన వ్యంగ్యాస్త్రం. నితాన్షి గోయల్, ప్రతిభా రంతా, స్పర్శ్ శ్రీవాస్తవ, రవి కిషన్ కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం.. సమాజంలో మహిళల స్వేచ్ఛ, సాధికారతను ప్రశ్నిస్తుంది. వివిధ దేశాల్లోనూ విడుదలైన ఈ సినిమా.. కేన్స్, టొరంటో వంటి ప్రతిష్టాత్మక చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమైంది. ఉత్తర భారతదేశంలోని గ్రామీణ పరిస్థితులు, అక్కడి మహిళల జీవితానికి ఈ చిత్రం అద్దం పడుతుంది.
ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్
తర్వాతి చిత్రం ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్.... ఆశ, గుర్తింపు, ఒంటరితనం.. వంటి అంశాలే నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు పొందింది. కేరళకు చెందిన ప్రభ, అను అనే ఇద్దరు నర్సుల కథే ఈ చిత్రం. ఓర్పు, సహనంతో ఉంటే ఎప్పటికైనా న్యాయానిదే గెలుపు అన్న చక్కటి సందేశాన్నిచ్చే ఈ సినిమాను పాయల్ కపాడియా రూపొందించారు.
‘గ్రాండ్ ప్రిక్స్
ఈ ఏడాది ఎక్కువగా చర్చ జరిగిన చిత్రం ‘గ్రాండ్ ప్రిక్స్’. ఈ ఏడాది కేన్స్ చిత్రోత్సవాల్లో ఈ సినిమా అవార్డు గెలుచుకుంది. మూడు దశాబ్దాల తర్వాత కేన్స్ చిత్రోత్సవాల్లో అవార్డు గెలుచుకున్న చిత్రంగా ఈ సినిమా అరుదైన గౌరవం దక్కించుకుంది. ‘ఈ సినిమా చాలా బాగుంది.. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రమిదని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ మధ్యే ఈ సినిమాకు కితాబిచ్చారు. అప్పట్నుంచీ ఈ సినిమా మరింత పాపులరైంది.
దో పత్తీ
గృహహింస.. ఈ సాంకేతిక యుగంలోనూ ఎంతోమంది మహిళలు మౌనంగా భరిస్తోన్న సమస్య ఇది. ఈ హింసను ఇప్పటికీ మౌనంగా భరిస్తున్న మహిళలు ఎందరో. ఇలాంటి గృహహింస కోణంగా తెరకెక్కిన చిత్రమే ‘దో పత్తీ’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్ ద్విపాత్రాభినయం చేసింది. సౌమ్య, శైలీ.. అనే రెండు పాత్రల్లో నటించిన ఆమె.. తన నటనతో ప్రేక్షకులు కంటతడి పెట్టేలా చేసింది. ఈ సినిమాలతో పాటు ఆర్టికల్ 370, యామీ గౌతమ్, జిగ్రా వంటి మహిళా ప్రాధాన్య చిత్రాలు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com