Gaddar Awards : 2025 తెలంగాణ ‘గద్దర్’అవార్డ్స్ ప్రకటించారు

Gaddar Awards :  2025 తెలంగాణ ‘గద్దర్’అవార్డ్స్ ప్రకటించారు
X

2025 తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ను ప్రకటించింది. ఈ ప్రకటన చూస్తే ఈ సారి సరైన ఎంపికలే జరిగినట్టుగా ఉన్నాయి. అవార్డ్ లు పొందిన వాళ్లంతా మాగ్జిమం ఎక్స్ పెక్ట్ చేయనట్టుగా ఉన్నాయి. గతంలో వచ్చిన అనుమానాలు, విమర్శలు దాటి ఈ సారి తెలంగాణ వాళ్లకు కూడా కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్టుగానే ఉంది. వీటితో పాటు 8 ప్రత్యేక కేటగిరీల్లో సినిమా లెజెండ్స్ ను ప్రకటించారు. మరి ఈ అవార్డులు పొందిన వాళ్ల లిస్ట్ చూస్తే..

ఇలా ఉంది.

ఉత్తమ నటుడు - నాగ చైతన్య (తండేల్‌)

ఉత్తమ నటి - రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్‌)

ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి

ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ ద్వితీయ చిత్రం - దండోరా

ఉత్తమ తృతీయ చిత్రం - ది ప్రీ వెడ్డింగ్‌ షో

నేషనల్‌ ఇంటిగ్రిటీ సినిమా - తండేల్‌

ఉత్తమ పర్యావరణ చిత్రం - ఇగ్వా

ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ - లిటిల్‌ హార్డ్స్

ఉత్తమ వినోదాత్మక చిత్రం - సంక్రాంతికి వస్తున్నాం

ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం - కోర్టు

ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ - మిరాయ్‌

ఉత్తమ బాలల చిత్రం - అనగనగనా

ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు - శివాజీ

ఉత్తమ సపోర్టింగ్‌ నటి- భూమిక

ఉత్తమ సంగీత దర్శకుడు - మార్క్ కె రాబిన్‌ (దండోరా)

ఉత్తమ నేపథ్య గాయకుడు - అనురాగ్‌ (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ నేపథ్య గాయని - సాహితి చాగంటి (కన్నప్ప)

ఉత్తమ హాస్యనటుడు - కృష్ణ తేజ (జిగ్రీస్‌)

ఉత్తమ బాలనటుడు - రోహన్ ‌ రాయ్‌ (ప్రీ వెడ్డింగ్‌ షో)

ఉత్తమ కథా రచయిత - గుణశేఖర్‌ (యుఫోరియా)

ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ - అనిల్‌ రావిపూడి

ఉత్తమ గేయ రచయిత - నందకిశోర్‌ (కుబేర)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ - కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)

ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌)

ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ - ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ కిష్కిందపురి

ఉత్తమ కొరియోగ్రాఫర్‌ - గిర గిర గిర

ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ - తోట తరణి ఛాంపియన్‌

ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ - గోవింద్‌ అఖండ

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ - చాంపియన్‌ - చంద్రకాంత్‌

ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ - 23

ఉత్తమ మేల్‌ యాక్టర్‌ - చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ నటి - అనంతిక (8 వసంతాలు)

స్పెషల్‌ జ్యూరీ హీరో - రోషన్‌ (చాంపియన్‌)

వీరితో పాటు ప్రత్యేక కేటగిరీల్లో అవార్డ్స్ పొందిన లిస్ట్ చూస్తే..

ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గా మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేశారు.

పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ - ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీకి గానూ కమల్ హాసన్ ను ఎంపిక చేశారు.

అలాగే

బిఎన్ రెడ్డి ఫిల్మ్ డైరెక్టర్ : సింగీతం శ్రీనివాసరావు

నాగిరెడ్డి - చక్రపాణి అవార్డ్ : చలసాని అశ్వినీ దత్

టిఎల్ కాంతారావు అవార్డ్ : ఆర్ నారాయణమూర్తి

రఘుపతి వెంకయ్య ఫల్మ్ అవార్డ్ : రమేష్ ప్రసాద్

సి నారాయణ రెడ్డి అవార్డ్ : సుద్దాల అశోక్ తేజ

అక్కినేని నాగేశ్వరరావు అవార్డ్ : శ్రీమతి జయసుధ

మొత్తం ఈ అవార్డ్స్ ప్రకటించిన విధానం ఈ సారి బావుంది అనిపించేలా ఉంది.

Tags

Next Story