Kalaavathi :దూసుకుపోతున్న కళావతి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని వ్యూస్ అంటే..!

Kalaavathi : మహేష్ సర్కారు వారి పాట ఫస్ట్ సాంగ్ కళావతి సాంగ్ సోషల్ మీడియాలో అదరగొడుతోంది.. "వందో, ఒక వెయ్యో, ఒకలక్షో మెరుపులు దూకినాయా.. ఏందే ఈ మాయ" అంటూ సాగే ఈ పాటకి సంగీత ప్రియులు వన్స్ మోర్ అనేస్తున్నారు.. ఎవరి నోట విన్న ఇప్పుడు ఇదే పాట వినిపిస్తోంది. అంతలా అందరి మైండ్ లో రిజిస్టర్ అయిపొయింది ఈ పాట.. ఇప్పటివరకు ఈ పాట 20మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ని సాధించింది. కేవలం అతి తక్కువ టైంలోనే ఈ పాటకి ఈ క్రేజ్ రావడం విశేషం.
అటు ఈ పాటకు అప్పుడే 943kకి పైగా లైక్స్ రావడం మరో విశేషం తమన్ స్వరపరిచిన ఈ పాటకి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన మహానటి ఫేం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ ఈ సినిమాని మే 12న రిలీజ్ చేయనున్నారు.
The combo of Super 🌟 @urstrulyMahesh & Sensational @MusicThaman delivers a Classic Chartbuster 🤘
— Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2022
20M+ views for #KalaavathiMusicVideo ♥
▶️ https://t.co/fVmmhK2hAC#SarkaruVaariPaata#SVPOnMay12@KeerthyOfficial @ParasuramPetla @sidsriram #AnanthaSriram @saregamasouth pic.twitter.com/ixooZhVVas
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com