ANR 100th Birth Anniversary : 25 నగరాలు 10 సినిమాలు.. అక్కినేని శతజయంతి ప్లాన్ ఇదే
తెలుగు సినీవినీలాకాశంలో ధ్రువతారగా పేరొందిన నటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు. తన నటనా కౌశలంతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. బతికి ఉన్నంత కాలం సినిమానే జీవితంగా బతికిన ఏయన్నార్ నటించిన సూపర్ హిట్ టాప్ 10 సినిమాలను సెప్టెంబర్ 20 నుంచి 22వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన 25 సిటీల్లో రీ రిలీజ్ చేయబోతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ ల్లోనే కాకుండా మల్టీ ప్లెక్స్ ల్లో కూడా ఆ టాప్ 10 సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ సంస్థలు అయిన ఐనాక్స్, పీవీఆర్ లతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అక్కినేని ఫ్యాన్స్ కి శత జయంతి వేడుక సందర్భంగా భారీ ట్రీట్ దక్కబోతుంది. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యే విధంగా ఫ్యామిలీ మెంబర్స్ ప్లాన్ చేస్తున్నారు. శతజయంతి ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మూడు రోజులు కూడా అక్కినేని ఫ్యాన్స్ కోసం సూపర్ హిట్ క్లాసిక్ మూవీస్ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా విడుదల చేయబోయే 10 సినిమాల వివరాలను వెల్లడించింది అక్కినేని ఫ్యామిలీ.. దేవదాసు, మాయాబజార్, మిస్సమ్మ, డాక్టర్ చక్రవర్తి, భార్యభర్తలు, గుండమ్మ కథ, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, సుడిగుండాలు, మనం మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com