Krishnam Raju: కృష్ణంరాజు సన్మానించింది పనిమనిషిని కాదట..

Krishnam Raju: 25 సం.లుగా కృష్ణంరాజు ఫ్యామిలీకి మేనేజర్ గా వ్యవహరిస్తున్న పద్మగారికి కృష్ణంరాజు దంపతులు సన్మానం చేశారు. కృష్ణంరాజుకు సంబంధించిన మీడియా రిలీజస్, ఇంటర్వ్యూ షెడ్యుల్స్ వంటి వ్యవహారాలు నిర్వహించడంలో పద్మ చురుగ్గా ఉంటారు. ఆమె చేసిన సేవలకు కృష్ణంరాజు దంపతులు ఆత్మీయ సత్కారం చేశారు. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన పద్మ 25 ఏళ్ల క్రితం కృష్ణంరాజు దగ్గర కార్యదర్శిగా చేరారు.
కృష్ణంరాజు కుటుంబంలో పద్మ ఒకరిగా కలిసిపోయారు కాబట్టే ఆయన అభిమానులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా ఆమెకు చాలా దగ్గరయ్యారు. కృష్ణంరాజు కూడా పద్మను ఒక కార్యదర్శిలాగా కాకుండా కుటుంబంలో వ్యక్తిగా చూస్తారు. అందుకే ఆయన, ఆయన భార్య శ్యామలదేవీ.. పద్మను చాలా గౌరవంతో చూసుకుంటారు.
కృష్ణంరాజు కుటుంబానికి ఉన్న అభిమానులను కూడా పద్మ ప్రేమగానే చూసుకుంటారు. ఫ్యాన్ మీట్స్‌ను ఆర్గనైజ్ చేస్తూ కృష్ణంరాజును, ప్రభాస్‌ను తమ అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంచుతారు పద్మ. 25 ఏళ్లుగా తమ దగ్గరే పనిచేస్తూ, తమలో ఒకరిగా కలిసిపోయిన పద్మను కష్ణంరాజు, శ్యామలదేవీ సత్కరించడం ఆనందాన్ని కలిగించే విషయం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com