Gopichand : విశ్వం థియేటర్స్ పెరిగాయట

మేచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన సినిమా ‘విశ్వం’. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మొన్న దసరాకు విడుదలైంది. శ్రీను వైట్ల రొటీన్ ఫార్మాట్ లోనే ఈ చిత్రాన్ని రూపొందించాడని.. ఏ మాత్రం కొత్తదనం లేదనే కమెంట్స్ వచ్చాయి. కాకపోతే కామెడీ సీన్స్ కొన్ని వర్కవుట్ అయ్యాయి అన్నారు. అయితే గోపీచంద్ గత చిత్రాలతో పోలిస్తే కాస్త బెటర్ అనే టాక్ కూడా వచ్చింది. అదే టైమ్ లో రజినీకాంత్ వేట్టైయన్ మూవీని తెలుగులో పెద్దగా పట్టించుకోలేదు. దేవర కొంత హల్చల్ చేసినా.. డల్ అయింది. విశ్వంతో పాటు విడుదలైన మా నాన్న సూపర్ హీరో, జనక అయితే గనక వంటివి ఓటిటి మూవీస్ అన్న పేరు తెచ్చుకున్నాయి. అలాగే ఈ వారం విడుదలైన సినిమాల్లో దేనికీ సరైన ప్రచారం లేదు. స్టార్స్ మూవీస్ కూడా లేవు. ఇవన్నీ విశ్వంకు కలిసొచ్చాయి అంటున్నారు. అందుకే రెండో వారంలో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 250 థియేటర్స్ అదనంగా పెరిగాయి అని చెబుతూ కొత్త పోస్టర్ వేశారు. ఓ రకంగా ఇది మూవీకి చాలా పెద్ద ప్లస్ అవుతుందనే చెప్పాలి. మౌత్ టాక్ తోనే తమ చిత్రానికి ఎక్కువ థియేటర్స్ పెరిగాయని మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు. అంతే కాదు.. దసరా బ్లాక్ బస్టర్ అని కూడా అంటున్నారు. మరి ఈ కొత్త థియేటర్స్ వల్ల విశ్వంకు ఎన్ని కలెక్షన్స్ పెరుగుతాయో చూద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com