Devara 1 : దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ చీఫ్ గెస్ట్ లెవరో తెలుసా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో దేవర టాక్స్ తప్ప ఇంకేం వినపించడం లేదు. కల్కి తర్వాత తెలుగు నుంచి వస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ కావడంతో పాటు కొన్నాళ్లుగా టాలీవుడ్ బాక్సాఫీస్ డల్ గా ఉంది. ఆ డల్ నెస్ ను పోగొట్టి బాక్సాఫీస్ కు దేవర కొత్త జోష్ తెస్తాడనే నమ్మకంతో చాలామంది చూస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కెపాసిటీకి ఇదో లిట్మస్ టెస్ట్ లాంటి మూవీ కూడా. రాబోయే రోజుల్లో అతను ప్యాన్ ఇండియా హీరోగా నిలుస్తాడా లేదా అనేది కూడా ఈ మూవీతో తేలిపోతుంది. ఆర్ఆర్ఆర్ లాంటి ఎపిక్ హిట్ ఉన్నా.. అందులో మేజర్ షేర్ రాజమౌళిది.. మిగిలింది రామ్ చరణ్ తో కలిసి పంచుకోవాలి. అందుకే దేవర ఒంటరిగా అతని దమ్మెంతో నిరూపించే సినిమా కాబోతోంది.
ఇక ఈ ఆదివారం రోజున దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. హైదరాబాద్ లోనే ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. మామూలుగా ప్రీ రిలీజ్ అనగానే చీఫ్ గెస్ట్ లు ఎవరు అనే ఆరాలు తీస్తుంటారు. మరి దేవర కోసం ఎవరొస్తున్నారో తెలుసా.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఒక్కరు కాదు.. ముగ్గురు టాప్ డైరెక్టర్స్ వస్తున్నారు. ఇందులో ఇద్దరు ప్యాన్ ఇండియా డైరెక్టర్స్ కావడం విశేషం.
ఎన్టీఆర్ కోసం ఎప్పుడూ ముందే ఉంటాడు రాజమౌళి. ఆయన ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. నెక్ట్స్ ప్రశాంత్ నీల్. అలాగే త్రివిక్రమ్. ఈ ముగ్గురూ దేవర ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ లుగా రాబోతున్నారు. త్రివిక్రమ్ గతంలోనే ఇది 'దేవర నామ సంవత్సరం' అన్నాడు. అది నిజమవుతుందా లేదా అనేది మరో వారంలో తేలిపోతుంది. ఇక ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ రాబోతోంది. ఇది 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కాబోతోంది.
ఇక అన్నీ కుదిరి ఉంటే దేవర స్థానంలో త్రివిక్రమ్ తోనే సినిమా చేయాల్సి ఉండె. బట్ సెట్ అవలేదు. త్రివిక్రమ్ డేట్స్ నే కొరటాల శివకు ఇచ్చాడు ఎన్టీఆర్. మరి ఈ ముగ్గురూ దేవరకు ఇచ్చే ఎలివేషన్స్ ఎలా ఉంటాయో ఈ ఫంక్షన్ లో చూద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com