Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంలో విషాదం.. ఆ ముగ్గురి మృతికి ఒకటే కారణం..

Puneeth Rajkumar: మరణం అనేది ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. కానీ ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకే కారణంతో వెంటవెంటనే చనిపోతే మాత్రం.. దానిని ప్రజలు శాపంలాగానే భావిస్తారు. దాదాపు నాలుగు నెలల క్రితం కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం ఆ కుటుంబాన్ని కలచివేసింది. ఇప్పుడు పునీత్ భార్య అశ్విని తండ్రి రేవనాథ్ గుండెపోటుతో కన్నుమూశారు. ఇలా కొన్నిరోజుల వ్యవధిలోనే వారి కుటుంబంలో ఇలా జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
పునీత్ రాజ్‌కుమార్ అంటే శాండల్‌వుడ్‌లో అస్సలు నెగిటివిటీ లేకుండా పేరు తెచ్చుకున్న హీరో. అందుకే ఆయన మరణం ఒక్కసారిగా అందరినీ కలచివేసింది. అప్పటివరకు తన కుటుంబంతో సంతోషంగా గడిపిన ఆయన జిమ్‌కు వెళ్లొస్తానని చెప్పి, అక్కడే గుండెపోటుతో మరణించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు సరిగ్గా అదే విషాదం వారి కుటుంబంలో మరోసారి చోటుచేసుకుంది.
శాండిల్‌వుడ్‌ను తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లిన రాజ్‌కుమార్ 2006లో గుండెపోటుతో మరణించారు. ఇక 2021 అక్టోబర్‌లో ఆయన చిన్న కుమారుడు పునీత్ రాజ్‌కుమార్ కూడా ఇలాగే మరణించారు. తండ్రి, కొడుకులు ఒకేలాగా మరణించడం ఆ కుటుంబాన్ని దు:ఖంలోకి తోసింది. ఇప్పుడు మరోసారి ఆ కుటుంబం నుండి మరో వ్యక్తి గుండెపోటుకు బలయ్యారు. పునీత్ మరణించిన తర్వాత తన భార్య అశ్విని తండ్రి రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఆ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది. అలా ఆయన ఆసుపత్రిలోనే గుండెపోటు రావడంతో కన్నూమూశారు. కాగా రేవనాథ్ NHAI చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. రేవనాథ్ స్వస్థలం చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా.. పునీత్ లాగే రేవనాథ్ కూడా తన కళ్ళని దానం చేశారు. భర్త పునీత్ రాజ్‌కుమార్ మృతితో బాధలో ఉన్న అశ్వినికి తండ్రి రేవనాథ్ మరణం తీరని లోటని అంటున్నారు ప్రేక్షకులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com